HomeMovie News Teluguపవన్ కళ్యాణ్‌ 'హరి హర వీరమల్లు' కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్!

పవన్ కళ్యాణ్‌ ‘హరి హర వీరమల్లు’ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ హరి హర వీరమల్లు పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. తాజాగా తొలి భాగానికి సంబంధించిన షూటింగ్ పూర్తయిందని చిత్ర బృందం ప్రకటించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటించగా, బాబీ డియోల్, సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో, మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రానికి తాజాగా విడుదల తేదీ ఖరారైంది. జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది అని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

ఈ సినిమాలోని ప్రచార చిత్రాలు, ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచాయి. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం ఒకేసారి విడుదల కానుంది. పవన్ అభిమానులు మాత్రమే కాదు, సినీప్రేమికులంతా ఈ సినిమాపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular