HomeMovie News Teluguదటీజ్‌ లేడీ సూపర్‌ స్టార్‌: ఆమెకు 'సరిలేరు వేరెవ్వరూ..'

దటీజ్‌ లేడీ సూపర్‌ స్టార్‌: ఆమెకు ‘సరిలేరు వేరెవ్వరూ..’

దీపావళికి ‘సరిలేరు నీకెవ్వరు..’ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. చెప్పినట్లుగానే దీపావళి గిఫ్ట్‌గా లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి లుక్‌ని రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్‌. ఊహించన దానికన్నా ఎక్కువగా ఉంది ఈ లుక్‌లో విజయ శాంతి రాజసం. ఇంతవరకూ ఆమె ఆటిట్యూడ్‌ గురించి మాట్లాడుకున్నాం. ఇదిగో ఇప్పుడు చూస్తున్నాం. ఇదే కదా.. లేడీ సూపర్‌ స్టార్‌ అంటే.. అనేలా ఉందీ లుక్‌. ‘భారతి’ అనే కాలేజ్‌ లెక్చరర్‌ పాత్రలో విజయ శాంతి నటిస్తోంది ఈ సినిమాలో. ఈ లుక్‌లో యాష్‌ కలర్‌ చీర, జాకెట్టు ధరించి, చేతికి ఓ వాచి, మెడలో నల్లని ఓ పూసల దండ ధరించి కాలు మీద కాలేసుకుని, ఠీవీగా చేతులు కట్టుకుని కుర్చీలో కూర్చున్నారు విజయ శాంతి. లుక్స్‌తోనే ఆకాశమంత ఆటిట్యూడ్‌ ప్రదర్శించేస్తున్నారు. విడుదలైన కాసేపటికే ఈ లుక్‌ వైరల్‌ అయ్యింది. ఈ ఫోటోపై అప్పుడే మీమ్స్‌ స్టార్ట్‌ చేసేశారు నెట్టింటి కళాకారులు.

మహేష్‌బాబుకీ, విజయ శాంతికీ మధ్య సీరియస్‌ డిస్కషన్‌ టైంలో ఆన్‌ సెట్స్‌లో తీసిన ఫోటో ఇది.. అంటూ పవర్‌ ఫుల్‌ స్టోరీలు అల్లేస్తున్నారు. గతంలో విజయ శాంతి, సూపర్‌ స్టార్‌ మహేష్‌ కలిసి ‘కొడుకు దిద్దిన కాపురం’ చిత్రంలో తల్లీ కొడుకుల పాత్రల్లో కనిపించిన సంగతి తెలిసిందే. మళ్లీ లాంగ్‌ గ్యాప్‌ తర్వాత విజయ శాంతి రీ ఎంట్రీ ఇవ్వడం, అది కూడా మహేష్‌ బాబు సినిమాతోనే కావడం విశేషం. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular