HomeMovie News Teluguఆల్ ఇండియా టాప్ 6లో సాహో!

ఆల్ ఇండియా టాప్ 6లో సాహో!

సాహో చేతికి మ‌రో రికార్డు చిక్కింది. తొలి వారంలో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన భార‌తీయ చిత్రాల‌లో 6వ స్థానం సంపాదించుకుంది. సాహోకి తొలి వారం 350 కోట్ల పైచిలుకు వ‌సూళ్లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ లెక్క‌న టాప్ 6లో సాహో స్థానం ద‌క్కించుకుంది. తొలి 5 స్థానాల్లో బాహుబ‌లి 2, సుల్తాన్‌, దంగ‌ల్‌, రోబో 2.ఒ, సంజు చిత్రాలున్నాయి.

వాటి స‌ర‌స‌న సాహో చేరింది. టాప్ 6లో ఒకే హీరో సినిమాలు రెండు చోటు చేసుకోవ‌డం ప్ర‌భాస్ విష‌యంలోనే జ‌రిగింది. ఓ విధంగా.. ద‌క్షిణాది మొత్తం గ‌ర్వించాల్సిన విష‌యం ఇది. నెగిటీవ్ టాక్ వచ్చినా, రేటింగులు దారుణంగా ఉన్నా సాహో ఈ స్థాయిలో విజృంభించ‌డం ట్రేడ్ వ‌ర్గాల్ని సైతం విస్మ‌య‌ప‌రుస్తోంది. మ‌రి సాహో జోరు.. ఏ స్కోరు ద‌గ్గ‌ర ఆగుతుందో చూడాలి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular