HomeMovie News Teluguట్విట్టర్ లో మరో రికార్డ్ సృష్టించిన మహేష్ బాబు..!

ట్విట్టర్ లో మరో రికార్డ్ సృష్టించిన మహేష్ బాబు..!

టాలీవుడ్ టాప్ స్టార్స్ లో మహేష్ బాబు కు ట్విట్టర్ లో అందరి కన్నా ఎక్కువ ఫాల్లోవర్లు ఉన్న విషయం తెలిసిందే… తాజాగా మరో ట్విట్టర్ రికార్డు మహేష్ ఖాతాలోకి చేరింది. మహేష్ బాబు తాజా చిత్రం ‘మహర్షి’ తో ఈ రికార్డు మహేష్ సొంతం అయింది. మహర్షి విడుదలయ్యి ఈ మధ్యే 3 కేంద్రాలలో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం సక్సెస్ పై మహేష్ కూడా కాలర్ ఎగరేసాడు.. ఇక మహేష్ అభిమానులు చేసిన హడావిడి అంత ఇంత కాదు.. దీనికి తోడు తాజాగా ట్విట్టర్ ఒక సర్వే లో, 2019 ప్రథమార్థం లో ఇండియా లోని టాప్ 5 ట్విట్టర్ ట్యాగ్స్ విడుదల చేసింది.

వీటి లో 4వ స్థానం లో సూపర్ స్టార్ “మహర్షి” ఉంది. ప్రథమ స్థానం లో తమిళ నటుడు అజిత్ ‘విశ్వాసం’ మరియు రెండు మూడు స్థానాల్లో ‘లోక్ సభ ఎలెక్షన్స్ 2019 మరియు “క్రికెట్ వరల్డ్ కప్ 2019” ఉన్నాయి. టాప్ 5 లో రెండు సౌత్ సినిమాలు ఉండడం విశేషం. ఇలాంటి అరుదైన రికార్డు మహేష్ బాబు సొంతం చేసుకోవడం తో సూపర్ స్టార్ అభిమానులు మళ్ళీ కాలర్ లు ఎగరేసి పండగ చేసుకుంటున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular