HomeMovie News Teluguరకుల్‌ లిప్‌లాక్‌: ట్విస్ట్‌ ఏంటంటే!

రకుల్‌ లిప్‌లాక్‌: ట్విస్ట్‌ ఏంటంటే!

మన్మధుడు 2‘ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తెలుగులో లాంగ్‌ బ్యాక్‌, ఫుల్‌ లెంగ్త్‌ హీరోయిన్‌గా నటించిన సినిమా ఇది. నాగార్జున హీరో. ప్రమోషన్స్‌లో నాగ్‌ ఈ సినిమా గురించి చాలా గొప్పగా చెప్పాడు. బాగానే ఉంది. కానీ, సినిమా చూసొచ్చినోళ్లు మాత్రం మరోలా మాట్లాడుకుంటున్నారు. రకుల్‌ పాత్రను తప్పు పడుతున్నారు. ఈ సినిమాని రకుల్‌ ఎలా ఒప్పుకుందిరా? బాబూ.. అంటూ సోషల్‌ మీడియాలో చీవాట్లు పెడుతున్నారు.

అందుకు కారణం ఈ సినిమాలో రకుల్‌ క్యారెక్టరేనట. హద్దులు దాటిన పాత్రలో రకుల్‌ కనిపించిందని ప్రచార చిత్రాలు కొంతమేర ప్రూవ్‌ చేసేశాయి. ఇక సినిమా విడుదలయ్యాక తెలిసిన విషయమేంటంటే, ‘లెజ్బియన్‌ యాక్ట్‌’ అంటూ రకుల్‌, ఝాన్సీ పెదాల్ని ముద్డాడడంతో, హేటర్స్‌ ఆమెని ఆటాడేసుకుంటున్నారు. విపరీతమైన ఎక్స్‌పోజింగ్‌ చేసింది. కదా.. అవసరం అనుకుంటే, నాగార్జునతో లిప్‌లాక్‌ పెట్టుకోవచ్చు కదా.

మరీ ఘోరంగా ఝాన్సీతో లిప్‌లాకేంటీ.. ఖర్మ కాకపోతేనూ అంటూ విస్తుపోతున్నారు. అసలు రకుల్‌ ఇలా చేసిందేంటబ్బా.. అని వాపోతున్నారు. సినిమా సంగతేమో కానీ, రకుల్‌, ఝాన్సీ లిప్‌లాక్‌ సీన్‌ మాత్రం నెట్టింట్లో తెగ వైరల్‌ అయిపోతోంది. ఇక సినిమా విషయానికి వస్తే, ‘మన్మధుడు 2’ అంచనాలను అందుకోవడంలో సాధించిన విజయం పట్ల ఇప్పటికైతే మిశ్రమ స్పందనే వినిపిస్తోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular