HomeMovie News Telugu'బిగ్‌బాస్‌ 3' తాజా లిస్ట్‌ ఇదిగో!

‘బిగ్‌బాస్‌ 3’ తాజా లిస్ట్‌ ఇదిగో!

బిగ్‌బాస్‌ మూడో సీజన్‌ మరి కొన్ని గంటల్లో ప్రసారం కానుంది ఈ సందర్భంగా బిగ్‌ హౌస్‌లో కంటెస్టెంట్స్‌గా ఎంటర్‌టైన్‌ చేయబోయేవాళ్లు వీళ్లే అంటూ ఓ లిస్ట్‌ హాట్‌ హాట్‌గా హల్‌చల్‌ చేస్తోంది. ఒకప్పుడు యంగ్‌ హీరోల్లో సెన్సేషన్‌ అయిన వరుణ్‌ సందేశ్‌ బిగ్‌ కంటెస్టెంట్స్‌ లిస్టులో ఉన్నాడు. విశేషమేంటంటే, ఈయన తన భార్య వితికా షెరుతో కలిసి బిగ్‌ హౌస్‌లో సందడి చేయబోతున్నాడు. ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో సునీత పాత్రలో ఆకట్టుకున్న పునర్నవికి బిగ్‌ హౌస్‌లో అవకాశం దక్కింది.

ఇక బుల్లితెర రాములమ్మ పేరు గత కొంతకాలంటా ప్రచారంలో ఉంది. ఆ ప్రచారం నిజమే అంటూ లిస్టులో ఆమె పేరును చేర్చారు. తెలంగాణా వీ6 ఛానెల్‌లో సావిత్రక్కగా పాపులర్‌ అయిన జ్యోతి, కాస్టింగ్‌ కౌచ్‌లో శ్రీముఖితో పాటు మీడియాలో హల్‌చల్‌ చేసిన ట్రాన్స్‌జెండర్‌ తమన్నా, రిపోర్టర్‌ జాఫర్‌, నటి హేమ, సింగర్‌ రాహుల్‌, మరో నటి హిమజ తదితరుల పేర్లతో కూడిన ఓ లిస్ట్‌ తాజాగా హల్‌చల్‌ చేస్తోంది. అయితే, ఈ లిస్టును బిగ్‌బాస్‌ టీమ్‌ అఫీషియల్‌గా రిలీజ్‌ చేసింది కాదు.

కానీ, దాదాపు ఈ పేర్లు బిగ్‌బాస్‌ హౌస్‌లో సందడి చేయబోయే కంటెస్టెంట్స్‌ పేర్లే అంటూ ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా, ఈ లిస్టు కన్‌ఫామా.? కాదా.? అనే సస్పెన్స్‌ వీడాలంటే రేపటి వరకూ వేచి చూడాల్సిందే. రేపట్నుంచి బుల్లితెరపై బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌ 3 విజయవంతంగా ప్రసారం కానుంది. నాగార్జున హోస్ట్‌గా 100 రోజుల పాటు, 14 మంది కంటెస్టెంట్స్‌తో ఈ షో నిర్వహించబడనుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular