HomeMovie News Teluguప్రబాస్‌ మామూలోడు కాదండోయ్‌.!

ప్రబాస్‌ మామూలోడు కాదండోయ్‌.!

‘బాహుబలి’ వంటి భారీ బడ్జెట్‌ చిత్రంలో నటించిన తర్వాత, ప్రబాస్‌ మళ్లీ అలాంటి సినిమాలో నటించడం సాధ్యం కాదనుకున్న తరుణంలో చిన్న సినిమాగా స్టార్ట్‌ అయిన సుజిత్‌ చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్‌ చిత్రంగానే మలిచేశాడు. దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో సుజిత్‌ దర్శకత్వంలో ‘సాహో’ రూపొందుతోంది.

ఇక్కడితో తన బడ్జెట్‌ భారీతనానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టేస్తాడేమో ప్రబాస్‌ అనుకుంటే, లేదు లేదు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. ‘బాహుబలి’ తర్వాత మూడో చిత్రంగా వస్తున్న ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ – ప్రబాస్‌ మూవీ కూడా భారీ బడ్జెట్‌తోనే రూపొందనుందనీ తాజా పరిస్థితుల దృష్ట్యా అర్ధమవుతోంది. అసలింతకీ ఆ తాజా పరిస్థితేంటంటే, ఈ సినిమా కోసం హైద్రాబాద్‌లో ఓ భారీ సెట్‌ని నిర్మిస్తున్నారట. ఈ సెట్‌ కోసం ఏకంగా 30 కోట్లు ఖర్చు చేస్తున్నారనీ తెలుస్తోంది. వాస్తవానికి ఈ షెడ్యూల్‌ షూటింగ్‌ యూరప్‌లో చిత్రీకరించాల్సి ఉందట. అయితే కొన్ని కారణాలతో ఆ ట్రిప్‌ని విరమించుకుని, యూరప్‌ వాతావరణాన్ని తలపించేలా హైద్రాబాద్‌లోనే సెట్‌ నిర్మిస్తున్నారట. గోపీకృష్ణ మూవీస్‌తో కలిసి, పీవీపీ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది. ‘జాన్‌’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. పూజాహెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది.

1970ల నాటి ఫీల్‌ గుడ్‌ రొమాంటిక్‌ మూవీ ఇది. ఓ వైపు ‘సాహో’ సినిమాలో నటిస్తూనే, సమాంతరంగా ‘జాన్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) లోనూ నటిస్తున్నాడు ప్రబాస్‌. ‘సాహో’ ఆగస్ట్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధాకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.   

You May Like This
- Advertisment -spot_img

Most Popular