HomeMovie News Teluguచైతూ కోసం సమంత.. అఖిల్‌ కోసం నాగ్‌.!

చైతూ కోసం సమంత.. అఖిల్‌ కోసం నాగ్‌.!

ఎట్టకేలకు సమంత రూపంలో అక్కినేని కుర్రోడు నాగచైతన్యకు ‘మజిలీ’తో హిట్టొచ్చింది. ఇక మరో అక్కినేని వారసుడు అఖిల్‌ కోసం స్వయంగా నాగార్జునే రంగంలోకి దిగనున్నాడు. ముచ్చటగా మూడు సినిమాల్లో హీరోగా నటించినా, అఖిల్‌కి ఆశించిన విజయం దక్కలేదింతవరకూ.

ఇక ఇప్పుడు అఖిల్‌ విషయంలో నాగ్‌ కొత్త స్ట్రేటజీని ఫాలో చేయబోతున్నాడట. నాగార్జున ప్రధాన పాత్రలో ‘బంగార్రాజు’ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘సోగ్గాడే చిన్ని నాయనా’కి ప్రీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ కోసం మొదట చైతూను తీసుకోవాలనుకున్నాడు నాగార్జున. కానీ ఇప్పుడు ఈక్వేషన్స్‌ మారిపోయాయి. ‘మజిలీ’ హిట్‌ తర్వాత చైతూని నెక్ట్స్‌ లెవల్‌లో ఊహిస్తున్నాడు నాగార్జున. సో ‘బంగార్రాజు’లో చైతూ ప్లేస్‌ని అఖిల్‌కి షిఫ్ట్‌ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అఖిల్‌ని అనుకున్నాక, స్క్రిప్టులో మార్పులు చోటు చేసుకోనున్నాయట. ఏదో గెస్ట్‌ రోల్‌ కోసమన్నట్లుగా కాకుండా, సినిమా అంతా, ప్రాధాన్యత ఉండేలా అఖిల్‌ పాత్రను డిజైన్‌ చేయమని డైరెక్టర్‌ కళ్యాణ్‌ కృష్ణకు నాగార్జున సూచించాడట. అంటే ‘బంగార్రాజు’ ఒక అక్కినేని మల్టీ స్టారర్‌ అవుతుందన్నమాట. అఖిల్‌ వచ్చి చేరాక ఈ సినిమాలో హీరోయిన్లు లిస్టు కూడా పెరిగింది.

నాగార్జున కోసం ఓ హీరోయిన్‌, అఖిల్‌ కోసం ఇంకో హీరోయిన్‌.. ఇలా ఇద్దరు భామలకు ఈ సినిమాలో అవకాశం దక్కింది. అయితే హీరోయిన్స్‌గా ఎవరిని ఫైనల్‌ చేశారనేది ఇంకా తెలియలేదు. కానీ అఖిల్‌ కోసం ఓ కొత్త భామ పేరు లిస్టులో ఉందట. త్వరలోనే పూర్తి డీటెయిల్స్‌ వెల్లడి కానున్నాయి. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular