HomeMovie News Teluguముంబై హోటల్ లో తెలుగు హీరోయిన్ కి చేదు అనుభవం..!

ముంబై హోటల్ లో తెలుగు హీరోయిన్ కి చేదు అనుభవం..!

గూఢచారి సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్లకు ముంబై హొటల్లో చేదు అనుభవం ఎదురైంది. గతంలో సైకో రామన్ వంటి చిత్రాల్లో నటించిన శోభితా ప్రస్తుతం ఓ హిందీ మూవీలో నటిస్తుంది. శోభితా ఓ ముస్లిమ్ అమ్మాయి పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. ఆ తరుణంలో షూటింగ్ పూర్తయ్యాక ఆ పాత్రకి ధరించిన దుస్తులతోనే హోటల్ కి వెళ్లిన తను.. ఓ బాధాకరమైన సంఘటన ఎదుర్కొన్నానని ట్విట్టర్ ద్వారా తెలియచేసింది. 

తన కోసం ఆ హోటల్లో రూమ్ బుక్ చేసారని, ఆ రూమ్ తాలూకు తాళాలు ఇవ్వమని అడిగితే రిసెప్షనిస్ట్ ఇవ్వకుండా చాలా కఠినంగా ప్రవర్తించాడని పేర్కొంది. ‘నేను హీరోయిన్ అని అక్కడున్న వ్యక్తికి తెలీదు. ఆ సమయంలో నేను బురఖాలో ఉన్నాను, నా బ్యాగ్ కూడా దుమ్ము ధూళితో నిండుకుని ఉంది. అందువల్లే అతను నాకు కీస్ ఇవ్వలేదు.

చుట్టూ చాలా మంది జనాలు చూస్తున్నా సరే అతను అనుచితంగా ప్రవర్తించటం చాలా బాధాకరమైన విషయం. నేను తలచుకుంటే ఆ వ్యక్తితో క్షమాపణ చెప్పించుకోగలను. కానీ నేను ఏమి అనకుండా అక్కడినుంచి వెళ్ళిపోయాను. నన్ను ఒక ముస్లిం యువతిగా భావించి కొద్ది నిముషాలు అలా ప్రవర్తించినందుకు నాకే ఇలా ఉంటే, మిగిలిన వారి పరిస్థితి ఏంటో ఆలోచించండి’ అంటూ తన ఆవేదనని వ్యక్తపరిచింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular