HomeMovie News Telugu'డార్లింగ్‌'తో లవ్‌లో పడిన లేడీ విలన్‌.!

‘డార్లింగ్‌’తో లవ్‌లో పడిన లేడీ విలన్‌.!

ప్రముఖ తమిళ నటుడు శరత్‌ కుమార్‌ తనయ వరలక్ష్మీ శరత్‌కుమార్‌ పేరు ఇప్పుడు తెగ మార్మోగిపోతోంది. కారణం హీరోయిన్‌గా కన్నా, ఈ మధ్య ఆమె విలన్‌గా నటించిన సినిమాలు బాగా సక్సెస్‌ అవ్వడమే. దాంతో హీరోయిన్‌ పర్సనాలిటీని పక్కన పెట్టేసి, పవర్‌ఫుల్‌ లేడీ విలన్‌గా గెటప్‌ మార్చేసి తెగ బిజీగా అయిపోయింది. నెగిటివ్‌ రోల్స్‌కి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన వరలక్ష్మీ ఇటీవల ‘పందెం కోడి 2’, ‘సర్కార్‌’ చిత్రాలతో మంచి గుర్తింపు దక్కించుకుంది. 

తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో పలు రకాల పాత్రలు పోషించిన వరలక్ష్మి ఇకపై తెలుగు సినిమాల పైనా దృష్టి పెట్టింది. ఆల్రెడీ తెలుగులో రెండు సినిమాలకు వరలక్ష్మి సైన్‌ చేసింది. రెండూ పవర్‌ఫుల్‌ పాత్రలే. అందులో ఒకటి యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ నటిస్తున్న ‘తెనాలి రామకృష్ణుడు బిఏబీఎల్‌’. ఈ సినిమాలో హన్సిక హీరోయిన్‌ కాగా, వరలక్ష్మీ పవర్‌ఫుల్‌ విలన్‌గా కనిపించబోతోంది. మరో సినిమా ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. 

ఈ సంగతి కాస్సేపు పక్కన పెడితే, వరలక్ష్మి ఫేవరేట్‌ హీరో ఎవరో తెలుసా.? యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ అట. ‘బాహుబలి’ సినిమా చూశాక ప్రబాస్‌కి వీరాభిమాని అయిపోయిందట. ప్రభాస్‌ యాక్టింగ్‌, బాడీ బిల్డింగ్‌ తనకెంతో నచ్చుతాయనీ, తన లైఫ్‌లో ‘ఐ లవ్‌ యూ’ అనే అందమైన ఎక్స్‌ప్రెషన్‌ చెప్పాల్సి వస్తే, అది ప్రభాస్‌కి మాత్రమే చెబుతానని నవ్వుతూ తన మనసులోని మాటను బయట పెట్టేసింది ముద్దుగుమ్మ వరలక్ష్మీ శరత్‌ కుమార్‌. అబ్బో.! ఇప్పటికే మన డార్లింగ్‌తో లవ్‌లో పడిన ముద్దుగుమ్మల లిస్టులో మరో ముద్దుగుమ్మ చేరిపోయిందన్నమాట.

You May Like This
- Advertisment -spot_img

Most Popular