HomeMovie News Telugu'ఆర్‌ఆర్‌ఆర్‌' బాహుబలిని మించి.!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బాహుబలిని మించి.!

జక్కన్న చెక్కుతున్న తాజా ప్రాజెక్ట్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఓ విషయంలో మించిపోనుందట. అదేంటంటే చరణ్‌, ఎన్టీఆర్‌ లుక్స్‌ పరంగా అని తెలుస్తోంది. వీరి పాత్రలకు సంబంధించి ఇద్దరికీ రెండు డైమన్షియల్స్‌ ఉంటాయట. రెండు డిఫరెంట్‌ లుక్స్‌లో రామ్ చరణ్‌, ఎన్టీఆర్‌ కనిపించనున్నారట. అందులో ఒకటి రెగ్యులర్‌ లుక్‌ కాగా, మరో లుక్‌ కోసం విపరీతంగా కండలు పెంచేయనున్నారనీ తెలుస్తోంది. ఆల్రెడీ చరణ్‌ ‘వినయ విధేయ రామ’ ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ కోసం ఒంటి నిండా టాటూలతో కండలు తిరిగిన దేహంతో కనిపించాడు. 

కఠినమైన డైట్‌ ఫాలో అయ్యాడు ఈ బాడీ కోసం. ఆ సినిమా పూర్తి కాగానే పెద్దగా గ్యాప్‌ తీసుకోకుండానే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌లో జాయిన్‌ అయ్యాడు. సో ఫిట్‌నెస్‌ పరంగా చరణ్‌కి పెద్దగా ప్రాబ్లెమ్‌ లేదు. కానీ ఎన్టీఆర్‌కి సంబంధించి ఫిట్‌నెస్‌పై ఆశక్తికరమైన చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్‌ ఈ సినిమాలో ఇంతవరకూ ఏ సినిమాలోనూ కనిపించని డిఫరెంట్‌ లుక్‌లో కనిపించనున్నాడట. ఈ మధ్య ఎన్టీఆర్‌ బాగా బరువు పెరిగాడు. అస్సలు ఫిట్‌గా లేడు. 

అందుకే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం స్పెషల్‌గా ఫిట్‌నెస్‌లో ట్రైనింగ్‌ తీసుకుంటున్నాడట. అందుకోసమే జూ. ఎన్టీఆర్‌ దుబాయ్‌ వెళ్లాడు. కొద్ది రోజుల్లోనే ఫిట్‌ బాడీతో ఇండియాకి తిరిగి రానున్నాడు. షూటింగ్‌లో జాయిన్‌ అవ్వనున్నాడు. ఇక తాజాగా ప్రచారంలో ఉన్న మరో ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ ఏంటంటే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో చరణ్‌, ఎన్టీఆర్‌ ఇద్దరూ ‘బాహుబలి’లో ప్రభాస్‌, రానాలను మించి, కండలు తిరిగిన దేహంతో బీభత్సమైన అరివీర భయంకరుల్లా కనిపించబోతున్నారనీ అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారమ్‌.

You May Like This
- Advertisment -spot_img

Most Popular