HomeMovie News Telugu'కేజీఎఫ్‌ - 2' బాహుబలిని మించిపోతుందా.?

‘కేజీఎఫ్‌ – 2’ బాహుబలిని మించిపోతుందా.?

కన్నడ నటుడు యష్‌ హీరోగా తెరకెక్కిన ‘కేజీఎఫ్‌’ని రూపొందించేటప్పుడు చిత్ర యూనిట్‌ ఇతర సినీ పరిశ్రమల గురించి ఆలోచించలేదు. కేవలం ఓ కన్నడ సినిమాగానే విడదుల చేశారు. అయితే రిలీజ్‌కి ముందు టీజర్‌కి వచ్చిన హైప్‌తో బాలీవుడ్‌లోనూ, టాలీవుడ్‌లోనూ కూడా ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే భారీగా ఈ సినిమాకి వసూళ్లు పోటెత్తాయి. బాలీవుడ్‌లో అయితే ఆ సినిమాతో పాటు వచ్చిన సినిమాలు దారుణంగా దెబ్బ తినేశాయి. 

బాహుబలి తర్వాత ఆ స్థాయిలో మాట్లాడుకున్న సౌత్‌ సినిమా ఇదే. ఇప్పటికే కర్ణాటకలో బాహుబలి వసూళ్లను బీట్‌ చేసేసింది ‘కేజీఎఫ్‌’. ఈ హైప్‌ని బట్టి ‘కేజీఎఫ్‌ 2’ను భారీ స్థాయిలో తెరకెక్కించాలనుకుంటున్నారట. ఇప్పుడొచ్చింది ‘కేజీఎఫ్‌ చాప్టర్‌ 1‘గా అభివర్ణిస్తున్నారు. తాజాగా తెరకెక్కించేది ‘కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2’గా రూపొందించనున్నారట. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడట. 

‘బాహుబలి’ని మించిపోయేలా ఈ ‘కేజీఎఫ్‌ చాప్టర్‌ 2’ ఉంటుందట. బాలీవుడ్‌తో పాటు, ఇతర భాషల నుండి కూడా పలువురు నటీనటులు ఈ సినిమాలో నటించనున్నారట. కన్నడ మూవీ అని మాత్రమే కాకుండా సౌత్‌ ఇండియన్‌ మూవీ అనేలా ‘కేజీఎఫ్‌ 2’ను ప్లాన్‌ చేస్తున్నారట. చూడాలి మరి బాహుబలి సిరీస్‌లా ‘కేజీఎఫ్‌’ సిరీస్‌ కూడా సౌత్‌ ఇండియన్‌ మూవీ స్థాయిని విస్తరిస్తాయేమో.! 

You May Like This
- Advertisment -spot_img

Most Popular