HomeMovie News Teluguఆర్యను పెళ్లాడబోతున్న అఖిల్‌ బ్యూటీ.!

ఆర్యను పెళ్లాడబోతున్న అఖిల్‌ బ్యూటీ.!

తమిళ హీరో ఆర్యతో అఖిల్‌ బ్యూటీ సాయేషా సైగల్‌ వివాహం జరగనుందనే వార్త ఇప్పుడు కోలీవుడ్‌లో హల్‌చల్‌ చేస్తోంది. అక్కినేని హీరో అఖిల్‌తో తెలుగులో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. అయితే ఆరంభం ఆశించిన రిజల్ట్‌ ఇవ్వకపోవడంతో అమ్మడికి తెలుగులో పెద్దగా క్రేజ్‌ రాలేదు కానీ, అఖిల్‌ బ్యూటీగా తెలుగు ప్రేక్షకులు మాట్లాడుకునేందుకు ఓ అవకాశం ఏర్పడింది. 

ఇదిలా ఉంటే, తెలుగులో కలిసి రాకపోయినా, ఈ ముద్దుగుమ్మకు తమిళంలో బాగానే కలిసొచ్చింది. తమిళ హీరో ఆర్యతో ‘గజనీకాంత్‌’ సినిమాలో సాయేషా నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా టైంలోనే వీరిద్దరి మధ్యా ప్రేమ చిగురించిందట. పెద్దల అంగీకారంతో వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారట. వీరిద్దరికీ వయసులో దాదాపు 17 ఏళ్ల డిఫరెన్స్‌ ఉందట. 

అయితే ఆర్య పేరు చాలా మంది ముద్దుగుమ్మల పక్కన బాగా నానిపోయిన పేరు. ఆర్య – అనుష్క, ఆర్య – నయనతార, ఆర్య – త్రిష ఇలా పలువురితో ఆర్యకు లవ్‌ ఎఫైర్స్‌ ఉన్నట్లు అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. ఒకవేళ అలాగే ఆర్య – సాయేషా అఫైర్‌ కూడా గాసిప్పేనా.? లేక నిజంగానే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారా.? అనేది తెలియాల్సి ఉంది. ‘అఖిల్‌’ తర్వాత హిందీలో ‘శివాయ్‌’ సినిమాలో నటించిన సాయేషా ప్రస్తుతం తమిళంలో సినిమాలు చేస్తోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular