HomeMovie News Teluguమొన్న సాయిపల్లవి ఇప్పుడు మెహ్రీన్‌.!

మొన్న సాయిపల్లవి ఇప్పుడు మెహ్రీన్‌.!

హీరోయిన్స్‌కి ఫలానా ఎఫైర్స్‌ ఉన్నాయట అంటే ఆ రూమర్స్‌ కాస్త బాగానే ఉంటాయి. కానీ ఆ హీరోయిన్‌కి చాలా పొగరంట అంటే మాత్రం ఆమె కెరీర్‌కి గండి పడ్డట్లే. ‘ఫిదా’తో అందర్నీ ఫిదా చేసన సాయిపల్లవి విషయంలో ఏ హీరోయిన్‌పైనా రానన్ని గాసిప్స్‌ వచ్చాయి.

ఏదో టాలెంట్‌ ఉండీ నెట్టుకుపోయింది కానీ, ఏకంగా ఆమెతో పని చేసిన నాని, నాగశౌర్య వంటి హీరోలే ఆమెపై అలా ఇలా అదోలా గుస్సా అయిన సంగతి తెలిసిందే. అది సాయి పల్లవి కెరీర్‌పై ఎంత మేర ప్రభావం చూపించి ఉంటుందనే విషయం పక్కన పెడితే, ఆమె నటించిన లేటెస్ట్‌ మూవీ ‘పడి పడి లేచె మనసు’ ఫెయిల్యూర్‌ కావడం ఆమె కెరీర్‌కి పెద్ద దెబ్బే అని చెప్పాలి. 

ఇకపోతే తాజాగా రూమర్స్‌ విషయానికి వచ్చేస్తే, హాట్‌ బ్యూటీ మెహ్రీన్‌కీ ఈ రూమర్స్‌ కష్టాలు మొదలయ్యాయి. మెగా అల్లుడు కళ్యాణ్‌దేవ్‌తో సినిమా నో అనిందనీ, దర్శక, నిర్మాతలకు రెమ్యునరేషన్‌ విషయంలో చుక్కలు చూపిస్తోందనీ, స్టార్‌ హీరోయిన్స్‌తో సైతం పోటీకి దిగుతూ పొగరు ప్రదర్శిస్తోందనీ రకరకాల పుకార్లు మెహ్రీన్‌పై షికార్లు చేస్తున్నాయి. 

అసలే కెరీర్‌ అంతంత మాత్రంగా సాగుతోన్న మెహ్రీన్‌ విషయంలో ఇలాంటి రూమర్స్‌ ఆమె ఫ్యూచర్‌ని దెబ్బ తీసే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ సంక్రాంతికి మెహ్రీన్‌ ”ఎఫ్‌ 2′ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాజల్‌ కాంబోలో వచ్చిన ‘కవచం’ తీవ్రంగా నిరాశపరిచిందీ ముద్దుగుమ్మని. ఇప్పుడు తాజా మూవీ ‘ఎఫ్‌ 2’తో తమన్నా కాంబో అయినా లక్కు తెచ్చిపెడుతుందో లేదో చూడాలిక.

You May Like This
- Advertisment -spot_img

Most Popular