HomeMovie News Teluguకేసీఆర్‌కే జై కొడుతున్న సినీ ప్రముఖులు.!

కేసీఆర్‌కే జై కొడుతున్న సినీ ప్రముఖులు.!

తెలుగు సినీ పరిశ్రమ వైపు నుండి కేసీఆర్‌కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మా ఫుల్‌ సపోర్ట్‌ మీకే అన్నట్లుగా కేసీఆర్‌కి మద్దతిస్తున్నారు సినీ ప్రముఖులు. గెలుపును ముందుగానే ఊహించిన టీఆర్‌ఎస్‌ పార్టీ తాము అనుకున్నది సాధిస్తున్నందుకు సంబరపడిపోతున్నారు. కేసీఆర్‌ చెప్పిందే జరిగింది. తెలంగాణాలో వార్‌ వన్‌ సైడ్‌ అయిపోయింది. ఓట్లు గల్లంతు కాదు, సీట్లే గల్లంతైపోయాయి. భారీ మెజార్టీతో కారు దూసుకెళ్లిపోతోంది. ముందస్తు ఎన్నికలకు దిగినందుకు కేసీఆర్‌ని పలువురు పలు రకాలుగా విమర్శించారు.

ఆ విమర్శల్లో ముఖ్యంగా కేసీఆర్‌ ఎక్కువ సమయం తన ఫామ్‌హౌస్‌లోనే గడుపుతారనే విమర్శ బాగా ప్రచారమైంది. అయితే ఈ పాయింట్‌ని టార్గెట్‌ చేసుకుని ప్రముఖ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ సోషల్‌ మీడియాలో స్పందించారు. ‘ఫామ్‌ హౌస్‌లో కాదు, ఫామ్‌లో ఉన్నారు. ఇదీ ప్రజాస్వామ్యం పవరంటే..’ కంగ్రాట్స్‌ కేసీఆర్‌ సర్‌ అని టీఆర్‌ఎస్‌ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మంచు మనోజ్‌ కూడా తన స్పందన తెలియజేశాడు. ప్రొఫైల్‌ పిక్‌గా కేటీఆర్‌ గన్‌ గురిపెడుతున్న పిక్‌ని పెట్టుకున్నాడు. ఒక్క బుల్లెట్‌తో ఇంతమందా.? అని ట్వీట్‌ చేశాడు.

ఇలా పలువురు ప్రముఖులు కంగ్రాట్స్‌ తెలుపుతుంటే, ఈ గెలుపును ముందుగానే ఊహించిన నందమూరి టైగర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌లు రిస్క్‌ చేయలేదు. ప్రచారంలో పాల్గొనలేదు. చాలా ఆచి తూచి వ్యవహరించారీ అన్నదమ్ములు ఈ విషయంలో. ఇకపోతే ఇలా ఒక్కరేమిటి.. చాలా మంది సినీ ప్రముఖుల మద్దతు తెలంగాణాకు మరోసారి కాబోయే ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కే దక్కడం విశేషం.

You May Like This
- Advertisment -spot_img

Most Popular