HomeMovie News Teluguఎఎమ్‌బి.. ఇప్పుడు అందరి నోటా మార్మోగిపోతోందంతే

ఎఎమ్‌బి.. ఇప్పుడు అందరి నోటా మార్మోగిపోతోందంతే

తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ విన్నా ‘ఎఎమ్‌బి’ గురించిన చర్చే విన్పిస్తోంది. ఒకప్పుడు ప్రసాద్స్‌ మల్టీప్లెక్స్‌ గురించి మాట్లాడుకునేవాళ్ళం. ఆ తర్వాత చాలా మల్టీప్లెక్స్‌ల గురించి మాట్లాడుకున్నా, అప్పటికీ ఇప్పటికీ ‘మల్టీప్లెక్స్‌’ అనగానే ముందుగా ప్రసాద్స్‌ గుర్తుకొస్తుంది. అలా ఇప్పుడు ‘ఎఎమ్‌బి సినిమాస్‌’ హాట్‌ టాపిక్‌ అయ్యింది. చూస్తే ఎఎమ్‌బిలోనే సినిమా చూడాలని అందరూ అనుకుంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత విలాసవంతమైన, ఆధునికమైన, సాంకేతికంగా అత్యున్నతమైనదిగా ఈ సూపర్‌ ప్లెక్స్‌ గురించి చెప్పుకుంటుండడం గమనార్హం. ఎంతైనా ఇది మహేష్‌బాబుకి చెందిన మల్టీప్లెక్స్‌ కదా! ఆ స్థాయిలో పాపులారిటీ రావడం పెద్ద వింతేమీ కాదంటారా! కావొచ్చుగాక. రిలీజ్‌ అయిన సినిమాలు చూడటం మాత్రమే కాదు, ఈ సూపర్‌ ప్లెక్స్‌లో ఈవెంట్స్‌ కూడా షురూ అయ్యాయి. ‘అంతరిక్షం’ సినిమా ట్రైలర్‌ని ఇక్కడే విడుదల చేశారు.

సెలబ్రిటీలు ఎఎమ్‌బి గురించి గొప్ప గొప్పగా చెబుతోంటే, అసలేంటి కథ? అంటూ ఆ సూపర్‌ ప్లెక్స్‌ని చూసేందుకు పోటెత్తుతున్నారు జనం. ఈ జోరులో మహేష్‌బాబు, ఈ తరహా సూపర్‌ ప్లెక్స్‌లు మరిన్నింటికి శ్రీకారం చుడతాడా? అనేది ఇంకో చర్చనీయాంశం. మహేష్‌ దారిలో మరికొంతమంది యంగ్‌ హీరోలు ఇప్పటికిప్పుడు సూపర్‌ ప్లెక్స్‌ని మించిన థియేటర్స్‌ సమూహాన్ని ప్లాన్‌ చేస్తున్నారట. అంతలా ఎఎమ్‌బి ఇప్పుడు అందరి నోటా నానుతోంది మరి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular