HomeMovie News Teluguజూ. పవర్‌ స్టార్‌ అఖిరా.. సినిమాల్లోకి వస్తాడా.?

జూ. పవర్‌ స్టార్‌ అఖిరా.. సినిమాల్లోకి వస్తాడా.?

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ – రేణుదేశాయ్‌ల తనయుడు అఖిరానందన్‌ ఇప్పటికే ఓ సినిమాలో నటించాడు. అయితే అందులో బాల నటుడు మాత్రమే. కానీ, అఖిరానందన్‌ని ‘జూనియర్‌ పవర్‌ స్టార్‌’గా అభివర్ణిస్తోన్న అభిమానులు, అతన్ని సినిమా హీరోగా చూడాలనుకుంటున్నారు. ‘దయచేసి జూనియర్‌ పవర్‌ స్టార్‌ అనొద్దు.. అది పవన్‌కళ్యాణ్‌కి కూడా ఇష్టం లేదు..’ అని రేణుదేశాయ్‌ కొన్నాళ్ళ క్రితం అభిమానులకు ఇచ్చిన స్వీట్‌ వార్నింగ్‌ వివాదాస్పదమయ్యింది. 

అభిమానులు తగ్గుతారా.? ఛాన్సే లేదు. రేణుదేశాయ్‌ నుంచి ఎప్పుడు అఖిరాకి సంబంధించిన ఫొటో సోషల్‌ మీడియాలో వస్తుందా.. అని ఎదురుచూస్తూనే వున్నారు. ఫొటో వచ్చిన ప్రతిసారీ, ‘జూనియర్‌ పవర్‌ స్టార్‌..’ అంటూ అఖిరాని పిలుచుకుంటున్నారు. తాజాగా రేణుదేశాయ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఫొటో వైరల్‌గా మారింది. పవన్‌తో పోల్చితే, అఖిరా చాలా హైట్‌. మెగా కాంపౌండ్‌లో వరుణ్‌ తేజ్‌ అందరికన్నా హైట్‌. నాగబాబు తనయుడు వరుణ్‌ కంటే హైట్‌ వుంటాడేమో అఖిరా.. అన్పిస్తోంది ఫొటోల్ని చూస్తోంటే. 

నటన అఖిరా బ్లడ్‌లోనే వుంది. నాన్న పవన్‌కళ్యాణ్‌, పవర్‌ స్టార్‌. అమ్మ రేణుదేశాయ్‌ కూడా నటి. సో, అఖిరాకి నటనపై ఆసక్తి వుండదని ఎలా అనుకోగలం.? అయితే, అఖిరా సినిమాల్లోకి అప్పుడే వచ్చే అవకాశం లేదు. 

పిల్లల భవిష్యత్తుపై తల్లిగా రేణుదేశాయ్‌కి ఓ అవగాహన వుంటుంది కదా.! ఆమె ఆలోచనల్ని ఎవరైనా అర్థం చేసుకోవాల్సిందే. పవన్‌ – రేణు విడిపోవడంతో పిల్లలు తల్లి దగ్గరే వుంటున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular