HomeMovie News Teluguఈ రాముడి 'వినయం' చూశారా.?

ఈ రాముడి ‘వినయం’ చూశారా.?

ఆహా లుక్‌ చూసేందుకు రెండు కళ్లూ చాలడం లేదు కదా. అంత నిండుగా ఉందీ మెగా రూపం. మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ నటిస్తున్న ‘వినయ విధేయ రామ’ చిత్రంలోనిదీ లుక్‌. 

మొన్న దీపావళి సందర్భంగా విడుదలైన ఫస్ట్‌లుక్‌కి ఎంత మంచి రెస్పాన్స్‌ వచ్చిందో తెలిసిందే. నిజానికి ఫస్ట్‌లుక్‌గా టైటిల్‌కి యాప్ట్‌ అవుతుందని ఈ లుక్‌నే రిలీజ్‌ చేద్దామనుకున్నారట. కానీ మాస్‌ అప్పీల్‌ కోసం లాస్ట్‌ మినిట్‌లో ఛేంజ్‌ చేసి ఆ లుక్‌ని రిలీజ్‌ చేశారట. దీపావళి తర్వాత వచ్చిన ‘రామ్‌ కొ.ణి.దె.ల..’ అనే టీజర్‌కి అనూహ్యమైన రెస్పాన్స్‌ వచ్చింది. 

ఇక కార్తీక పౌర్ణమి సందర్భంగా లేటెస్టుగా రిలీజ్‌ చేసిన ఈ ట్రెడిషనల్‌ లుక్‌కి ఇంకా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. పంచెకట్టులో స్మార్ట్‌ లుక్‌లో స్వీట్‌ స్మైల్‌ ఇస్తూ నమస్కారం చేస్తున్న మెగా వారసున్ని చూస్తూ చూపు తిప్పుకోలేకపోతున్నారు అభిమానులు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది. డి.వి.వి.దానయ్య నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. బోయపాటి శీను దర్శకత్వంలో ‘వినయ విధేయ రామ’ తెరకెక్కుతోంది. కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రశాంత్‌, ఆర్యన్‌ రాజేష్‌ వంటి సీనియర్‌ హీరోలు ఈ సినిమాలో చరణ్‌కి అన్నయ్యలుగా కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ విలన్‌గా నటిస్తున్నాడు. టీజర్‌లో వీరందరికీ స్థానం దక్కింది. హీరోయిన్‌ కైరా అద్వానీ లుక్‌ని ఇంకా రివీల్‌ చేయాల్సి ఉంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular