HomeMovie News Teluguఅనసూయని మళ్లీ ఆడేసుకుంటున్నారు.!

అనసూయని మళ్లీ ఆడేసుకుంటున్నారు.!

బుల్లితెర అందాల తార అనసూయ వెండితెర పైనా వెలిగిపోతోంది. హాట్‌ హాట్‌గా అందాలారబోసేస్తూ ఇదీ నా ఆటిట్యూడ్‌ అని చెప్పడం అనసూయకే చెల్లింది. ఆమెకి సోషల్‌ మీడియాలో బోలెడంత మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. ఇందులో ఆమెని అభిమానించే వారు, ఆమెని ట్రాల్‌ చేసేవారు కూడా ఉన్నారు. అనసూయ ఫోటో పోస్ట్‌ చేసిందంటే చాలు, పోజిటివ్‌ కామెంట్స్‌, నెగిటివ్‌ కామెంట్స్‌ కుప్పలు తెప్పలుగా వచ్చేస్తుంటాయి. 

తాజాగా అనసూయ ఓ ఫోటో పోస్ట్‌ చేసింది. ఆ తర్వాత ఓ ఇంట్రెస్టింగ్‌ అంశాన్ని ప్రస్థావించింది. ఫోటోలో ఆమె పొట్టి నిక్కరేసుకుని సముద్రం వైపు చూస్తూ కనిపించింది. నిజానికి ఏమంత వల్గర్‌గా లేదీ ఫోటో. కానీ నెటిజన్లలో కొందరు ఊరుకోలేదు. ఈ వయసులో ఈ డ్రస్సులు నీకవసరమా.? అని కడిగి పారేశారు. దాంతో అనసూయకి ఒళ్లు మండిందో లేదంటే, లైట్‌ తీసుకుందో కానీ, ఆమె నుండి ఇంకో ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌ బయటికి వచ్చింది. అందులో – ‘హెర్‌ స్కింపీ అవుట్‌ ఫిట్‌ డిడ్‌ నాట్‌ అస్సాల్ట్‌ హెర్‌.. హెర్‌ డ్రింకింగ్‌ డిడ్‌ నాట్‌ అస్సాల్ట్‌ హెర్‌.. మేన్‌ అస్సాల్టెడ్‌ హెర్‌.. అండ్‌ ఎట్‌ సొసైటీ వాంట్స్‌ టు బ్లేమ్‌ హెర్‌..’ అంటూ పోస్ట్‌ చేసింది. 

ఇంకంతే మళ్లీ ఆమెని ఆడేసుకోవడం మొదలుపెట్టారు నెటిజన్లు. తన అభిప్రాయాన్ని ఆమె చెప్పడం చాలా మందికి నచ్చడం లేదు. అయితే అది ఆమె తప్పు కాదు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular