HomeMovie News Telugu'ఆర్‌ఆర్‌ఆర్‌' మెగా ముహూర్తం రేపే.!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మెగా ముహూర్తం రేపే.!

తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మక మల్టీ స్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. మెగా నందమూరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఇటు మెగా అభిమానుల్లోనూ, అటు నందమూరి అభిమానుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. 

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌నీ, నందమూరి యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌నీ దర్శకుడు రాజమౌళి ఎలా చూపించబోతున్నాడో అని. ఇంతటి ప్రతిష్ఠాత్మక చిత్రానికి రేపే అనగా నవంబర్‌ 11న ముహూర్తం నిర్ణయించిన సంగతి తెలిసిందే. రేపు జరగబోయే ఈ సినిమా ప్రారంభోత్సవానికి ఎవరెవరు హాజరు కానున్నారోననే ఉత్కంఠ మరోవైపు నెలకొంది. రాజమౌళితో ఇంతవరకూ నటించిన హీరోలందరూ ఈ సినిమా ప్రారంభోత్సవానికి రానున్నారనీ ఓ సమాచారమ్‌. 

అలాగే తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన అతిరధ మహారధులందరూ హాజరు కానున్నారట ఈ ప్రారంభోత్సవానికి. అత్యంత ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు. 

ఈ సినిమాకి సంబంధించిన మరి కొన్ని సస్పెన్స్‌లు రేపటితో వీడిపోనున్నాయట. చాలా చాలా సర్‌ప్రైజ్‌లు ఈ ప్రారంభోత్సవం రోజు ప్లాన్‌ చేశారనీ తెలుస్తోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular