HomeMovie News Teluguమాస్‌.. ఊర మాస్‌ సాయి పల్లవి

మాస్‌.. ఊర మాస్‌ సాయి పల్లవి

సాయి పల్లవి అనగానే ఆమె వేసే అద్భుతమైన డాన్సులు గుర్తుకొస్తాయి. మంచి నటి కూడా. తొలి తెలుగు సినిమాతోనే తెలుగులో డబ్బింగ్‌ చెప్పేసుకుంది ఈ మలర్‌ బ్యూటీ. అది కూడా, అచ్చమైన.. అత్యంత కష్టమైన తెలంగాణ స్లాంగ్‌లో. ఆషామాషీ విషయం కాదు. అప్పుడెప్పుడో ఓ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్‌ డాన్స్‌ షోలో మెరిసి, ఆ తర్వాత సినిమాల్లోకొచ్చిన ఈ మలర్‌ బ్యూటీ, తెలుగులో ‘ఫిదా’, ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’ తదితర సినిమాల్లో నటించి మెప్పించింది. 

ఇప్పుడు ఈ బ్యూటీ, తమిళంలో ధనుష్‌ సరసన ‘మారి-2’ సినిమా చేస్తోంది. ధనుష్‌ సినిమాలంటే సూపర్‌ మాస్‌ అనే స్థాయిలో వుంటాయి. ఆ సూపర్‌ మాస్‌ సినిమాలో, ఊర మాస్‌ పాత్రలో కన్పించబోతోంది సాయి పల్లవి. ఆటోవాలా గెటప్‌లో సాయి పల్లవి ఫొటోలు చూస్తే ఎవరైనా షాకవ్వాల్సిందే. ఆమెలో మరీ ఇంత ఊర మాస్‌ యాంగిల్‌ వుందా.? అని ఆశ్చర్యపోకుండా వుండలేరెవరూ! 

ధనుష్‌, డాన్సుల్లో దిట్ట. అలాంటి ధనుష్‌తో సాయి పల్లవి పోటీ పడి డాన్సులు చేసేసిందట. ఆమె పాత్ర పేరు ఆరాత్తు ఆనందిని. ఈ పాత్రలో సాయి పల్లవి చేసే అల్లరి అంతా ఇంతా కాదట. చాన్నాళ్ళ క్రితం వచ్చిన ‘మారి’ సినిమాకి ఈ ‘మారి-2’ సీక్వెల్‌. బాలాజీ మోహన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న మారి చిత్రాన్ని వుండర్‌ బీర్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. 

త్వరలో ఈ సినిమా విడుదల కానుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular