HomeMovie News Teluguవిలేజ్‌లో సందడి చేయనున్న సూపర్‌స్టార్‌.!

విలేజ్‌లో సందడి చేయనున్న సూపర్‌స్టార్‌.!

‘రంగస్థలం’ సినిమా కోసం హైద్రాబాద్‌లోనే ఓ భారీ విలేజ్‌ సెట్‌ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సినిమా బ్లాక్‌ బస్టర్‌ అవ్వడంతో ఆ సెట్‌కి మంచి పేరొచ్చింది. ఇక ఇప్పుడు మహేష్‌బాబు నటిస్తున్న ‘మహర్షి’ సినిమా కోసం కూడా అదే తరహాలో ఓ భారీ విలేజ్‌ని మన భాగ్య నగరంలోనే సృష్టించేశారు. ఇంతవరకూ డెహ్రాడూన్‌, అమెరికా తదితర ప్రదేశాల్లో షూటింగ్‌ జరుపుకున్న ‘మహర్షి’ చిత్రం త్వరలో ఈ విలేజ్‌ సెట్‌లో అడుగుపెట్టనుంది. 

సూపర్‌స్టార్‌ 25వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. కాలేజీ కుర్రోడిగా, బిజినెస్‌ మేగ్నైట్‌గా, విలేజ్‌కొచ్చిన ఎన్నారైగా మూడు డిఫరెంట్‌ వేరియేషన్స్‌లో మహేష్‌బాబు కనిపించబోతున్నారీ సినిమాలో. చిన్ననాటి స్నేహితుడి కోసం అమెరికా నుండి పల్లెటూరికి వచ్చిన ఎన్నారై ఏం చేశాడు.? అనే నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

పల్లెటూరి స్నేహితుడి పాత్రలో అల్లరి నరేష్‌ నటిస్తున్నాడు. ప్రస్తుతం విలేజ్‌ సెట్‌లో అల్లరి నరేష్‌, సూపర్‌స్టార్‌ మహేష్‌బాబులపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగనుంది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ‘భరత్‌ అనే నేను’ విజయం తర్వాత మహేష్‌ నుండి వస్తున్న సినిమా కావడంతో ‘మహర్షి’పై అంచనాలు భారీగా ఉన్నాయి. 

ఈ సినిమా కోసం మహేష్‌బాబు తొలిసారిగా రఫ్‌ లుక్‌ని ట్రై చేశారు. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకి మ్యూజిక్‌ అందించారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular