HomeMovie News Teluguస్వీటీ బ్యూటీ ఆ స్వీట్‌ న్యూస్‌ చెప్పేసిందా.?

స్వీటీ బ్యూటీ ఆ స్వీట్‌ న్యూస్‌ చెప్పేసిందా.?

జేజమ్మ అనుష్క పెళ్లి కబురు వినాలని అభిమానులు ఎప్పటి నుండో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇదిగో పెళ్లంట, అదిగో పెళ్లంట, పెళ్లి కొడుకు ఆ హీరో అట, కాదు కాదు బిజినెస్‌మేన్‌ అట.. ఇలా అనుష్క పెళ్లిపై పలు రకాల గాసిప్స్‌ ప్రచారమవుతూనే ఉన్నాయి. కానీ స్వీటీ ఆ స్వీట్‌ న్యూస్‌ మాత్రం కన్‌ఫామ్‌ చేయడం లేదు. 

తాజాగా సోషల్‌ మీడియాలో అనుష్క పోస్ట్‌ చేసిన ఫోటో ఒకటి అనుష్క పెళ్లి కబురు చెప్పబోతోందనే విషయం చెప్పకనే చెప్పేస్తోంది. ఆకులను కాలి మెట్టెలుగా పెట్టుకున్న ఫోటో అది. ‘దీనికి క్యాప్షన్‌ అవసరం లేదు’ అనే హ్యాష్‌ ట్యాగ్‌ ఇచ్చింది ఆ ఫోటోకి. అంటే స్వీటీ త్వరలోనే పెళ్లి కబురు చెప్పబోతోందంటూ మరోసారి హాట్‌ హాట్‌గా ప్రచారం మొదలైంది. ఆ పిక్‌కి నెటిజన్లు జోష్‌గా లైకులు, కామెంట్లు ఇచ్చేస్తున్నారు. ‘భాగమతి’ సినిమా తర్వాత అనుష్క మరో సినిమాలో నటించలేదు. 

అయితే తమిళంలో మాధవన్‌ హీరోగా ఓ సినిమాకి అనుష్క సైన్‌ చేసిందని ప్రచారం జరుగుతోంది. అలాగే తెలుగులోనూ ఓ సినిమాకి కమిట్‌ అయ్యిందట. అయితే ఆ ప్రాజెక్టు వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు కానీ, స్వీటీ ఇప్పుడేం చేస్తుందీ..? అంటే బరువు తగ్గే పనిలో బిజీగా ఉందట. 

‘సైజ్‌జీరో’ సినిమా కోసం పెరిగిన బరువు అనుష్కకు పెద్ద సంకటంగా మారింది. యోగా టీచరే కదా, తలచుకుంటే బరువు తగ్గడం ఎంత పని.? అనుకుని ఆ సినిమా కోసం అంత పెద్ద రిస్క్‌ చేసేసింది అనుష్క. కానీ ఆ తర్వాత నుండీ పెరిగిన బరువును తగ్గించుకోవడం కత్తి మీద సామే అయ్యింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular