HomeMovie News Teluguహీరోయిన్లతో 'హగ్గు'లు ఇకపై వుండవా?

హీరోయిన్లతో ‘హగ్గు’లు ఇకపై వుండవా?

డస్కీ బ్యూటీ అమలా పాల్‌, ఓ దర్శకుడి విషయంలో చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ ఈవెంట్‌లో దర్శకుడితో కలిసి పాల్గొంది అమలా పాల్‌. ప్రేమ పూర్వకంగా దర్శకుడితో ఓ హగ్‌ కోసం అమలా పాల్‌ ట్రై చేస్తే, ఆ యువ దర్శకుడు సింపుల్‌గా ‘హగ్‌’ వద్దని చెప్పేశాడట. దాంతో తాను షాక్‌కి గురైనట్లు ఈ బ్యూటీ చెప్పింది. 

తెలుగులో ‘బెజవాడ’, ‘నాయక్‌’ సినిమాల్లో నటించిన అమలా పాల్‌ ఒకింత రెబల్‌ భావాలున్న మహిళ. సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి గతంలోనే ఈ భామ గళం విప్పింది. ఆ అంశాన్ని తాజాగా ప్రస్తావిస్తూ, ‘మీ టూ’ ఉద్యమం ఈ స్థాయికి రావడం పట్ల హర్షం వ్యక్తం చేసింది. ఆ సంగతి పక్కన పెడితే, చాలామంది దర్శక నిర్మాతలు, నటీనటులు ఇప్పుడు హీరోయిన్లతో ‘హగ్‌’ అంటే భయపడిపోతున్నారు. ఎక్కడ ఆ హగ్‌ ఆ తర్వాత ‘లైంగిక వేధింపు’ అనే ఆరోపణలకు తావిస్తుందోనన్నది వారి ఆందోళన. 

బుల్లితెరపై పలు షోలలో కూడా ఈ హగ్‌లు సర్వసాధారణమైపోయాయి. అలాంటిది, ‘మీ టూ’ ఉద్యమం తర్వాత ‘హగ్‌’ అంటే భయపడే పరిస్థితి రావడం ఆశ్చర్యకరమే. అభిమానంతో ఇచ్చే హగ్‌కీ, కామ వాంఛతో రగిలిపోతూ హగ్‌ని కోరుకోవడానికీ చాలా తేడా వుంది. కానీ, పరిస్థితులు ఇప్పుడు మారాయి. హగ్‌కి అర్థం మారిపోయింది. ‘మీ టూ’ అంటూ మహిళా లోకం గళం విప్పుతోంది, పోరాటం చేస్తోంది. కాబట్టి ‘హగ్‌’ విషయంలో ఎవరైనా ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. 

అటువైపు నుంచి ‘హగ్‌’ కోసం ఆఫర్‌ వచ్చినా, పురుష పుంగవులు అప్రమత్తంగా వుండాల్సిందే.

You May Like This
- Advertisment -spot_img

Most Popular