HomeMovie News Teluguరష్మిక బ్రేకప్‌.. అసలేం జరిగింది.?

రష్మిక బ్రేకప్‌.. అసలేం జరిగింది.?

టాలీవుడ్‌లో ఇప్పుడు గోల్డెన్‌ బ్యూటీ అనే ఇమేజ్‌తో హల్‌చల్‌ చేస్తోంది కన్నడ బ్యూటీ రష్మిక మండన్న. రష్మికకి కన్నడ సినీ ప్రముఖుడు రక్షిత్‌ శెట్టితో ఒకప్పుడు పీకల్లోతు ప్రేమ వ్యవహారం నడిచిన సంగతి తెల్సిందే. అయితే ఆ ప్రేమ పెటాకులయ్యింది. త్వరలో ఈ ఇద్దరూ పెళ్ళి చేసుకోవాల్సి వుండగా, పెళ్ళికి కొద్ది నెలల ముందు ఇద్దరి మధ్యా మనస్పర్ధలొచ్చాయి. వాటికి కారణమేంటి? అనేది మాత్రం అధికారికంగా బయటకు రాలేదు. 

సోషల్‌ మీడియాలో రష్మిక అభిమానులు, రక్షిత్‌ అభిమానులూ ‘ఈ కారణంగానే విడిపోయారు’ అంటూ చాలా కారణాల్ని ప్రచారంలోకి తెచ్చారు. అయితే రక్షిత్‌ హుందాగానే ఈ గాసిప్స్‌పై స్పందిస్తూ, రష్మిక తప్పేమీ లేదని తేల్చాడు. అలాగని రష్మికతో విడిపోతున్న విషయాన్నీ ఒప్పుకోలేదు. అయితే ఈ ఇద్దరి మధ్యా మనస్పర్ధలకు కారణం రష్మిక పెళ్ళికంటే సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యమివ్వడమంటూ ఓ ప్రచారం మళ్ళీ గట్టిగా తెరపైకొచ్చింది. తెలుగులో రష్మిక వరుస సినిమాలు చేస్తోంది. ఈ విషయంలో రష్మికకి ఓ యంగ్‌ హీరో ఫుల్‌ సపోర్ట్‌ ఇచ్చాడట. ఆ సపోర్ట్‌, రక్షిత్‌కి నచ్చలేదని సమాచారమ్‌. 

ఆ హీరో ఎవరనేది సస్పెన్స్‌. అయితే తెలుగులో రష్మిక, ‘ఛలో’ సినిమాలో నటిస్తున్నప్పుడూ గాసిప్స్‌ వచ్చాయి. ‘గీత గోవిందం’ సినిమాలో నటిస్తున్నప్పుడూ ఆమెతో టాలీవుడ్‌ హీరో ఎఫైర్‌ అనే గాసిప్స్‌ వచ్చాయి. ఇదిలా వుంటే లేటెస్ట్‌గా రష్మిక విషయమై విజయ్‌ దేవరకొండ కొన్ని ప్రశ్నల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది మీడియా నుంచి. ఆ ప్రశ్నల్లో ముఖ్యమైనది, రష్మిక బ్రేకప్‌పై స్పందించమనడం. 

తాను మూడో వ్యక్తిననీ, అసలేం జరిగిందో ఆ ఇద్దరికే తెలియాలనీ, ఈ ప్రశ్న తనను అడగడం భావ్యం కాదనీ విజయ్‌ సమాధానమిచ్చాడు. అంతే, అంతకు మించి విజయ్‌ మాత్రం ఏం చెప్పగలడు?

You May Like This
- Advertisment -spot_img

Most Popular