HomeMovie News Teluguనానా పటేకర్‌.. నువ్వెంతటి రసికుడివో.!

నానా పటేకర్‌.. నువ్వెంతటి రసికుడివో.!

నానా పటేకర్‌ పేరు చెప్పగానే, ఎన్నో అద్భుతమైన బాలీవుడ్‌ సినిమాలు మన కళ్ళ ముందు మెదులుతాయి. భారతీయ సినీ పరిశ్రమలో అతనొక గొప్ప నటుడు. ఎంత గొప్ప నటుడంటే, అతనేమీ కమర్షియల్‌ హీరో కాదు.. విలక్షణ నటుడు అయినా, అతనికి హీరోలకంటే ఎక్కువ రెమ్యునరేషన్‌ అందేది. నానా పటేకర్‌ నటనకు అవార్డులు పరిగెత్తుకుంటూ వచ్చాయి. 

అదే, ఆ గొప్ప ఇమేజ్‌ కారణంగానే, నానా పటేకర్‌లో ‘నెగెటివ్‌ యాంగిల్‌’ కూడా పుట్టుకొచ్చింది. అదే అవకాశాల పేరుతో మహిళల్ని వేధించడం. ఆయన వేధింపులకు తాను తీవ్రంగా బాధపడాల్సి వచ్చిందంటూ బాలీవుడ్‌ హీరోయిన్‌ తనూశ్రీదత్తా ఇటీవల సంచలన ఆరోపణలు చేయగా, అదంతా ఉత్తదేనంటూ నానా పటేకర్‌ కౌంటర్‌ ఎటాక్‌ చేస్తూ లీగల్‌ నోటీసులు పంపాడు. ఇప్పటిదాకా నానా పటేకర్‌ చాలామంచోడని చాలామంది అనుకున్నారు. కానీ, నానా పటేకర్‌ బాధితులైన బాలీవుడ్‌ మహిళామణులు ఒకరొకరుగా తెరపైకొస్తున్నారు. 

తాజాగా డింపుల్‌ కపాడియా, నానా పటేకర్‌లోని ‘దుర్మార్గపు’ కోణాన్ని బయటపెట్టింది. డింపుల్‌ కపాడియా, తనను నానా పటేకర్‌ వేధించాడని ఆరోపించింది. ఇప్పటికే తనూశ్రీదత్తాని నానా పటేకర్‌ వేధింపులకు గురిచేసిన సందర్భానికి సంబంధించి ఓ వీడియో కూడా వెలుగులోకి వచ్చిన దరిమిలా, డింపుల్‌ కపాడియా ఆరోపణలతో ‘నానా నువ్వింతటి రసికుడివా?’ అని బాలీవుడ్‌ ఆశ్చర్యపోతోంది. 

అయితే ఇప్పటికింకా నానా పటేకర్‌పై వస్తున్నవి ఆరోపణలే. అవి నిజమని తేలాలంటే, సమగ్ర విచారణ జరగాల్సి వుంది. జరుగుతుందా మరి?

You May Like This
- Advertisment -spot_img

Most Popular