HomeMovie News Teluguబిగ్ బాస్ 2 విజేత కౌశలేనా!

బిగ్ బాస్ 2 విజేత కౌశలేనా!

బిగ్ బాస్ సీజన్ 2 నేటితో ముగియనుంది. ఇంకొన్ని గంటల్లో విజేత ఎవరో తేలిపోనుంది. అయితే ఆఖరి అయుదుగురిలో ఒక్క పేరు మాత్రం కచ్చితంగా విజేత అని ఎక్కువ శాతం ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

ఆ ఇంటి సభ్యుడు మరెవరో కాదు కౌశల్. ఇప్పటికే కౌశల్ ఆర్మీ పేరిట ఆయనకి బయట చాలానే ఫాలోయింగ్ ఉన్న నేపధ్యంలో బిగ్ బాస్ ఈ సీజన్ విజేత కౌశల్ అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. అందులోనూ కౌశల్ ఆర్మీ కూడా చివరి వరకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది.

అయితే బిగ్ బాస్ అంటేనే సంచలనాలకి కేర్ అఫ్ అడ్రస్ కాబట్టి చివరి నిమిషంలో ఏదైనా జరిగే ఆస్కారం ఉన్న పరిస్థితుల్లో వేరే వారు కూడా టైటిల్ గెలిచే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ టెన్షన్ కి మరికొన్ని గంటల్లో తెరపడనుంది.

చూద్దాం… అందరు ఊహిస్తున్నట్టుగా కౌశల్ టైటిల్ గెలుస్తాడా లేదా…

You May Like This
- Advertisment -spot_img

Most Popular