HomeMovie News Teluguసమంత అలా చేస్తే తప్పేంటి.?

సమంత అలా చేస్తే తప్పేంటి.?

బాలీవుడ్‌ బ్యూటీ కరీనాకపూర్‌ పెళ్ళయ్యాక.. ఓ బిడ్డకు తల్లయ్యాక కూడా హాట్‌ హాట్‌గా ఫొటోలకు పోజులు ఇస్తోంది. పెళ్ళయ్యాక, పెళ్ళికి ముందు.. అన్న ‘భిన్నమైన ఆలోచనలు’ ఇంతకు ముందు గ్లామరస్‌ ప్రపంచంలో వుండేవేమో. ఇప్పుడు ఆ హద్దులు చెరిగిపోయాయి. అందుకే, థర్టీ ప్లస్‌లోనూ హీరోయిన్లుగా సత్తా చాటుతున్నారు అందాల భామలు. 

ఏమో, నలభయ్యేళ్ళు వచ్చాక కూడా పాతికేళ్ళ హీరోతో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేయడానికి అందాల భామలు ‘సై’ అనేసే రోజులొస్తాయేమో. ఏం, హీరోలు మాత్రమే.. తమకంటే చాలా తక్కువ వయసులో వున్న హీరోయిన్లతో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ పండించాలా.? అన్నది చాలామంది ప్రశ్న. 

అసలు విషయమేంటంటే, తాజాగా హీరోయిన్‌ సమంతకి సంబంధించిన ఓ ఫొటో సోషల్‌ మీడియాలో ‘ట్రాలింగ్‌’కి కారణమయ్యింది. ఆ ఫొటోలో సమంత ఒకింత హాట్‌గా కన్పించింది. అది టూ పీస్‌ స్విమ్‌ సూట్‌ లాంటిది. దానిపై సోషల్‌ మీడియాలో కొందరు జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే వీటికి సమంత సైతం తనదైన స్టయిల్లో సమాధానమిచ్చింది. ఆమె తనకు మద్దతుగా మాట్లాడుతున్నవారి కామెంట్స్‌ని రీ-ట్వీట్‌ చేస్తోంది. లేడీ కమెడియన్‌ విద్యుల్లేఖరామన్‌, ఈ విషయంలో సమంతకి పూర్తి మద్దతిచ్చింది. 

‘పెళ్ళయ్యాక, పెళ్ళికి ముందు’ అనే చర్చలో అర్థమే లేదని, ఎలాంటి వస్త్రాలు ధరించాలన్నది ఆయా వ్యక్తుల ఇష్టమని విద్యుల్లేఖ రామన్‌ అభిప్రాయపడింది. గతంలో ఆమె ఓ ఫొటో షూట్‌కి సంబంధించిన ఫొటోల్ని పోస్ట్‌ చేస్తే, ‘అంత భారీ కాయంతో ఎక్స్‌పోజింగ్‌ అవసరమా.?’ అని ఆమెనీ ట్రాల్‌ చేసేశారు కొందరు. అప్పట్లోనే తనను తాను ఆమె గట్టిగా సమర్థించుకుందనుకోండి, అది వేరే విషయం.

You May Like This
- Advertisment -spot_img

Most Popular