HomeMovie News Teluguరాజమౌళి ఇంట పెళ్ళి బాజాలు.. అమ్మాయి ఎవరో తెలుసా..?

రాజమౌళి ఇంట పెళ్ళి బాజాలు.. అమ్మాయి ఎవరో తెలుసా..?

ఎస్ ఎస్ రాజమౌళి – రమ కుమారుడు అయిన కార్తికేయ నిశ్చితార్ధం నిన్న సాయంత్రం హైదరాబాద్ లో కుటుంబసభ్యులు మధ్య నిరాడంబరంగా జరిగింది.

ఇక పూర్తి వివరాల్లోకి వెళితే, కార్తికేయ కి ప్రముఖ నిర్మాత స్వర్గీయ వీబీ రాజేంద్రప్రసాద్ పెద్ద కుమారుడు అయిన రామ్ ప్రసాద్ కూతురు ప్రియా ప్రసాద్ తో నిశ్చితార్ధం జరిగింది. ఈ నిశ్చితార్ధానికి ఇరువురి కుటుంబసభ్యులతో పాటుగా అత్యంత సన్నిహిత మిత్రులు మాత్రమే హాజరయినట్టుగా తెలుస్తున్నది.

అలా హాజరయినవారిలో హీరో అఖిల్, నిర్మాత శోభు యార్లగడ్డ తదితరులు ఉన్నారు. ఇక ఈ నిశ్చితార్థం విషయాన్ని కార్తికేయ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా అందరితో పంచుకున్నాడు.

వీరి వివాహానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular