HomeMovie News Teluguఒకరోజు ముందే మెగాస్టార్‌ బర్త్‌డే గిఫ్ట్‌.!

ఒకరోజు ముందే మెగాస్టార్‌ బర్త్‌డే గిఫ్ట్‌.!

ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు. మెగా అభిమానులకు అసలు సిసలు పండగ రోజు. ఆ రోజు చిరంజీవి నుండి మెగా ఫ్యాన్స్‌ అద్భుతమైన గిఫ్ట్‌ని ఆశించడంలో కొత్తేమీ లేదు. అయితే ఈ సారి ఆ గిఫ్ట్‌ బర్త్‌డేకి ఒకరోజు ముందే అందుకోనున్నారు మెగా అభిమానులు. ఆగస్టు 21 ఉదయం 11.30 గంటలకు చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్‌ వచ్చేస్తోంది. 

చిరంజీవి నుండి ఆ రోజు ఏదో ఒక ఫస్ట్‌లుక్కో, పోస్టరో వస్తుందని ఇంతవరకూ ఊహించిన అభిమానులకు ఇది సంతోషించదగ్గ సమాచారమ్‌. అభిమానుల్ని ఏమాత్రం నిరాశపరచకుండా ఉండబోతోందట ఆ టీజర్‌. రీ ఎంట్రీలో చిరంజీవి నుండి వచ్చిన ‘ఖైదీ నెం 150’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద అనూహ్యంగా భారీ వసూళ్లు రాబట్టింది. ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనింగ్‌తో పాటు, సందేశాత్మక చిత్రంగా రూపొందింది ఆ చిత్రం. 

అయితే ఇప్పుడొస్తున్న ‘సైరా’పై భారీ అంచనాలున్నాయి. ఎందుకంటే ఇది చారిత్రాత్మక చిత్రం. మరగున పడిపోయిన మన తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుని జీవిత గాధ. కథ పరంగా అత్యంత బలమైనది. బడ్జెట్‌ పరంగానూ బలమైనదే. ఇంతవరకూ తెలుగు తెరపై ఎప్పుడూ చూడని అతి క్లిష్టమైన పోరాట ఘట్టాలను ఈ సినిమాలో చూడబోతున్నాం. 

సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నాడు. బిగ్‌బీ అమితాబ్‌తో పాటు, తమిళ, మలయాళ, కన్నడ పరిశ్రమల నుండి ప్రముఖ నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. నయనతార, తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular