HomeMovie News Teluguకలర్స్‌ స్వాతికి పెళ్లంట.!

కలర్స్‌ స్వాతికి పెళ్లంట.!

ముద్దు ముద్దు మాటలతో బుల్లితెర ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుని, హీరోయిన్‌గా వెండితెరపై కూడా వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ కలర్స్‌ స్వాతి పేరు ఈ మధ్య ఎక్కడా వినిపించడం లేదు. ‘అష్టాచెమ్మా’ సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. ‘స్వామి రారా’, ‘త్రిపుర’ తదితర చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. 

తెలుగుతో పాటు, తమిళ, మలయాళ సినిమాల్లోనూ మంచి నటిగా పేరు తెచ్చుకుంది. తెలుగులో ‘లండన్‌ బాబులు’ సినిమా తర్వాత స్వాతి ఎక్కడా కనిపించలేదు. తాజాగా కలర్స్‌ స్వాతికి పెళ్లంటూ సోషల్‌ మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ మధ్య చాలా మంది సెలబ్రిటీల పెళ్లిళ్లు ఇలాగే గాసిప్స్‌తో మొదలై, తర్వాత పెళ్లి పీటలదాకా వెళ్లాయి. 

గతంలో సెలబ్రిటీస్‌ పెళ్లి వార్తలు కేవలం గాసిప్స్‌గానే మిగిలిపోయేవి కానీ, ఇప్పుడలా కాదు. నిప్పు లేకుండా పొగ రాదు కదా.. అనే సామెత బాగా వర్కవుట్‌ అవుతోంది. ఎంతో కొంత నిజం లేకుండా ఈ పెళ్లి వార్తలు పుట్టుకు రావడం లేదు. అలాగే స్వాతి పెళ్లి వార్తను కూడా పూర్తిగా కొట్టి పారేయడానికి లేదండోయ్‌. 

మలేషియన్‌ ఎయిర్‌లైన్స్‌ ఉద్యోగి వికాస్‌తో గత కొంత కాలంగా కలర్స్‌ స్వాతి ప్రేమలో ఉందనీ, ఆ ప్రేమ ఇప్పుడు పెళ్లి దాకా చేరనుందనీ తెలుస్తోంది. ఆగష్టు 30 వారి పెళ్లికి శుభ ముహూర్తమంటూ సోషల్‌ మీడియాలో ఈ జంటకు సంబంధించిన ఓ ఫోటో కూడా హల్‌చల్‌ చేస్తోంది. మరి నిజంగానే కలర్స్‌ స్వాతి పెళ్లి చేసుకోబోతోందా? తెలియాలంటే, ఆగష్టు 30 వరకూ వేచి చూడాల్సిందే.!

You May Like This
- Advertisment -spot_img

Most Popular