HomeMovie News Teluguకౌషల్‌ ఆర్మీని తట్టుకోవడం కష్టమే.!

కౌషల్‌ ఆర్మీని తట్టుకోవడం కష్టమే.!

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ కౌషల్‌కి బోలెడంత మంది ఫాలోవర్స్‌ ఉన్నారు ట్విట్టర్‌లో. ఆ ఫాలోవర్లు చాలా యాక్టివ్‌గా ఉన్నారు. వాస్తవానికి తేజస్విని ఫాలోవర్స్‌ సంఖ్య కన్నా, కౌషల్‌ ఫాలోవర్స్‌ సంఖ్య చాలా చాలా తక్కువే. తేజుకి 78వేల మంది ఫాలోవర్స్‌ ఉంటే,. గట్టిగా కౌషల్‌కి 50 వేలు మించి లేరు. 

కానీ ‘కౌషల్‌ ఆర్మీ’ పేరుతో పెద్ద నెట్‌వర్కే నడుస్తోంది సోషల్‌ మీడియాలో. ఎవరు నడిపిస్తున్నారో తెలీదు కానీ, ఈ ఆర్మీని తట్టుకోవడం కూసింత కష్టమే అనిపిస్తోంది. చాలా చాలా యాక్టివ్‌గా ఉన్నారు వీరంతా. బిగ్‌బాస్‌ విన్నర్‌ కౌషలే అని ప్రచారం చేస్తున్నారు. కౌషల్‌ అప్పోనెంట్స్‌ని అస్సలు వదలడం లేదు. బూతులు తిడుతూ కౌంటర్‌ ఎటాక్‌ చేస్తున్నారు. తేజస్విని ఫాలోవర్స్‌ నుండి కూడా కౌంటర్‌ ఎటాక్స్‌ పడుతున్నాయి. కానీ మెజార్టీ ఎక్కువైనా కౌషల్‌ ఆర్మీ ముందు తేజు ఫాలోవర్స్‌ పప్పులేం ఉడికేలా లేదు. 

లాస్ట్‌ సీజన్‌లో ఇలాంటివేమీ లేవు. ముమైత్‌ ఖాన్‌, శివబాలాజీ, అర్చన, నవదీప్‌ తదితర పాపులర్‌ సెలబ్రిటీలున్నప్పటికీ, ఆ సీజన్‌లో సోషల్‌ మీడియాలో ఇంత హడావిడి లేదు. హౌస్‌లో కౌషల్‌పై చాలా వ్యతిరేకత ఉంది. హౌస్‌ నుండి బయటికి వెళ్లిపోయిన తేజు, భాను, కిరీటి తదితరులు కౌషల్‌తో గొడవ కారణంగా బయటికి వెళ్లిపోయినవారే. ప్రస్తుతం ఉన్న ఇంటి సభ్యుల్లో చాలా మంది దాదాపు హౌస్‌ మేట్స్‌ అంతా కౌషల్‌కి యాంటీగా ఉన్నవారే. 

కానీ బయట అంటే సోషల్‌ మీడియాలో కౌషల్‌కున్నంత ఫాలోయింగ్‌ గత సీజన్‌లో కానీ, ఇప్పుడున్న సీజన్‌లో మరో సెలబ్రిటీకి కానీ లేదంటే అతిశయోక్తి కాదు. చూడాలి మరి ఈ ఫాలోయింగ్‌ బిగ్‌బాస్‌ 2 విజేతగా కౌషల్‌ నిలిచేందుకు ఎంత మేర సహకరిస్తుందో.!

You May Like This
- Advertisment -spot_img

Most Popular