HomeMovie News Teluguఆ విషయంలో మహేష్‌ బాబే టాప్‌

ఆ విషయంలో మహేష్‌ బాబే టాప్‌

హీరోగా సూపర్‌ స్టార్‌గానే కాదు, బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా మహేష్‌బాబు హవా కొనసాగుతోంది. ఎన్నో ప్రముఖ వాణిజ్య ప్రకటనలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నా మహేష్‌బాబు, తాజాగా ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారాడు. టాలీవుడ్‌కి సంబంధించినంత వరకూ ఈ తరహా ఒప్పందాల్లో మహేష్‌బాబే టాప్‌. అంతేకాదు, రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్‌ అందుకుంటున్నాడు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మహేష్‌బాబు. 

ఈ విషయంలో మహేష్‌కి దరిదాపుల్లో ఎవ్వరూ లేరనే చెప్పాలి. ఆ తర్వాత స్థానంలో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పేరుంటుంది. ఇప్పుడిప్పుడే యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కూడా దూకుడు పెంచాడు. ఓ మొబైల్‌ కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారాడు ఎన్టీఆర్‌. గతంలోనూ ఎన్టీఆర్‌ పలు వాణిజ్య సంస్థలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. 

ఇకపోతే ఈ మధ్యనే మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కూడా రంగంలోకి దూకాడు. ‘హ్యాపీ’ మొబైల్‌ సంస్థకు రామ్‌ చరణ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌, అక్కినేని హీరోలు నాగచైతన్య, అఖిల్‌, సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ తదితరులు పలు వస్త్ర దుకాణాలకు ప్రచార కర్తలుగా వ్యవహరిస్తున్నారు. 

ఇక ముద్దుగుమ్మల విషయానికి వస్తే, సమంత, రాశీఖన్నా ఇలా పలువురున్నారు. తాజాగా రంగమ్మత్త అనసూయ కూడా మొదలెట్టింది. ఓ వస్త్ర దుకాణానికి అదిరిపోయే స్టైల్స్‌లో పబ్లిసిటీ ఇరగదీసేస్తోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular