HomeMovie News Teluguఎన్టీఆర్‌ ఇంట మరో చిచ్చరపిడుగు

ఎన్టీఆర్‌ ఇంట మరో చిచ్చరపిడుగు

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఇంట మరో చిచ్చర పిడుగు అల్లరి చేయడానికి వచ్చేశాడు. ఎన్టీఆర్‌ భార్య లక్ష్మీ ప్రణతి తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా అభిమానులకు సంతోషంగా పంచుకున్నాడు ఎన్టీఆర్‌. 

‘నా కుటుంబం మరింత పెద్దదైంది. నాకు మళ్లీ బాబు పుట్టాడు’ అని ట్వీట్‌ చేశాడు. ఎన్టీఆర్‌ తన పెద్ద కొడుకు అభయ్‌ రామ్‌ ముచ్చట్లను అప్పుడప్పుడూ అభిమానులతో పంచుకుంటూ తెగ మురిసిపోతుంటాడు. అలా ఇప్పుడు మరో ముద్దుల బాబు, అభయ్‌రామ్‌కి బుజ్జి తమ్ముడు ఎన్టీఆర్‌ ఇంట్లో సందడి చేసేందుకు వచ్చేశాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌కి పలువురు సినీ ప్రముఖులు కంగ్రాట్స్‌ చెబుతూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. కొత్తగా వచ్చి చేరిన ఈ బుల్లి ఎన్టీఆర్‌కి ఏం పేరు పెట్టనున్నాడో మన ఎన్టీఆర్‌ చూడాలి మరి. 

మరోవైపు ఎన్టీఆర్‌ ప్రస్తుతం ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. హారికా హాసినీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని రాధాక్రిష్ణ నిర్మిస్తున్నారు. హాట్‌ బ్యూటీ పూజా హెగ్దే, ఎన్టీఆర్‌తో జత కడుతోంది. 

ఇటీవలే ఈ సినిమాలో పూజా హెగ్దే పాత్రకు సంబంధించిన షూటింగ్‌ పూర్తైంది. దసరా బరిలో ఈ సినిమాను ఉంచేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular