HomeMovie News Teluguఫస్ట్‌ సినిమా ఫస్ట్‌ కిస్‌

ఫస్ట్‌ సినిమా ఫస్ట్‌ కిస్‌

శ్రీదేవి కూతురు జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా ‘ధడక్‌’ చిత్రంతో తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కన్నడలో ఘన విజయం సాధించిన ‘సైరత్‌’ మూవీకి ఇది హిందీ రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఇషాన్‌ ఖత్తర్‌, జాన్వీకి జోడీగా నటిస్తున్నాడు. 

కాగా తొలి సినిమా అయినా జాన్వీ అప్పియరెన్స్‌ చాలా మెచ్యూర్డ్‌గా కనిపిస్తోంది ఈ సినిమాలో. లేటెస్టుగా రిలీజైన ట్రైలర్‌ ద్వారా ఈ విషయం అర్ధమవుతోంది. కాగా తొలి సినిమా అయినా కానీ గ్లామర్‌లో కెవ్వుకేక పుట్టిస్తోంది జాన్వీకపూర్‌. జాన్వీ గ్లామర్‌ షో ఆడియన్స్‌కి ఆల్రెడీ అలవాటే. పలు గ్లామర్‌ స్టిల్స్‌లో జాన్వీ ఇప్పటికే ఆడియన్స్‌కి తనలోని గ్లామర్‌ యాంగిల్స్‌ని చూపెట్టేసింది. అయితే ఆన్‌ స్క్రీన్‌ జాన్వీ గ్లామర్‌ షో చూడడం మాత్రం ఇదే కదా ఫస్ట్‌ టైమ్‌. హీరోతో జాన్వీ ఫస్ట్‌ కిస్‌ని ట్రైలర్‌ ద్వారా రివీల్‌ చేసేశారు. 

ట్రైలర్‌లోనే కాదు, సినిమాలో ఇలాంటి హాట్‌ రొమాంటిక్‌ కిస్‌లు చాలానే ఉన్నాయట. ట్రైలర్‌లో చూపించిన జాన్వీ లిప్‌ టు లిప్‌ కిస్‌ సీన్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. తొలి సినిమాకే ఇంత గాఢమైన లిప్‌ కిస్‌లో నటించేందుకు జాన్వీ ఎలా ఒప్పుకుంది.. అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. కానీ స్టోరీ డిమాండ్‌ చేయడంతో నటించక తప్పలేదంటోంది జాన్వీ. 

ఇక పర్‌ఫామెన్స్‌ పరంగా, ట్రైలర్‌తోనే మంచి మార్కులేయించుకుంటోంది జాన్వీ. కూతురిని అలా హీరోయిన్‌గా చూడాలని తపించిపోయిన శ్రీదేవికి ఆ కోరిక తీరకుండానే మృత్యువు కబలించివేసింది. కానీ ఆన్‌ స్క్రీన్‌ జాన్వీ తనదైన స్టైల్‌లో టాలెంట్‌ చూపించేలానే ఉంది. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాతో జాన్వీ తల్లికి తగ్గ తనయ ఎలా అనిపించుకుంటుందో చూడాలి మరి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular