HomeMovie News Teluguజాన్వీకపూర్‌ పెళ్లి సందడి?

జాన్వీకపూర్‌ పెళ్లి సందడి?

అక్క పెళ్లిలో చెల్లెళ్లు జాన్వీకపూర్‌, ఖుషీ కపూర్‌లు సందడి మామూలుగా లేదు. బాలీవుడ్‌ బ్యూటీ సోనమ్‌ కపూర్‌ వివాహం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ముంబయ్‌లో సోనమ్‌ పూర్‌ – ఆనంద్‌ అహూజాల వివాహం ఘనంగా జరిగింది. కాగా సోనమ్‌ కపూర్‌ పెళ్లి వేడుకలో శ్రీదేవి – బోనీ కపూర్‌ సంతానం అయిన జాన్వీ కపూర్‌, ఖుషీ పూర్‌లు సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు. 

సోనమ్‌ కపూర్‌ ఎవరో కాదు, జాన్వీకి స్వయానా బాబాయ్‌ కూతురు కావడంతో సందడంతా వీరిదే అయ్యింది. బోనీకపూర్‌ సోదరుడు అనిల్‌ కపూర్‌ కూతురు అయిన సోనమ్‌ కపూర్‌ వివాహ వేడుకలో బ్రైట్‌ కలర్‌ కాస్ట్యూమ్స్‌లో ఫోటోలకు పోజులిస్తూ, జాన్వీ సందడి సందడిగా కనిపించింది. ఆ ఫోటోలు నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తున్నాయి. జాన్వీతో పాటు, ఖుషీ కూడా హాట్‌ అండ్‌ బ్రైట్‌ కాస్ట్యూ మ్‌లో మెరిసిపోతోంది.

ఇటీవల దుబాయ్‌లో ఓ పెళ్లి వేడుకకు హాజరైన శ్రీదేవి యాక్సిడెంటల్‌గా బాత్‌ టబ్‌లో మునిగి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె మరణాన్ని కొంతమంది అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ తరుణంలో కూతుళ్లైన జాన్వీ, ఖుషీలు వేడుకల్లో ఇలా మునిగి తేలిపోవడమేంటి? ఫోటోలకు అంతలా హాట్‌ పోజులిచ్చేయడమేంటి? అని వాపోతున్నారు. 

అయినా సెలబ్రిటీస్‌ కదా. ఎప్పటిది అప్పుడే మర్చిపోవాలి. కష్ట సుఖాలు ముఖంలో తెలియనీయకూడదు. మేకప్‌ చాటున వాటిని దాచేయాలి అంతే. అదే ఇప్పుడు ఖుషీ, జాన్వీ చేస్తున్నారేమో. వారిని తప్పు పట్టలేం కదా.!

You May Like This
- Advertisment -spot_img

Most Popular