HomeMovie News Telugu'భరత్‌' వీడియోలు కిర్రాకు పుట్టిస్తున్నాయ్‌

‘భరత్‌’ వీడియోలు కిర్రాకు పుట్టిస్తున్నాయ్‌

సినిమా నిర్మాణం ఒక ఎత్తయితే, ఆ సినిమాని రిలీజ్‌ చేయడం ఇంకో ఎత్తు. సినిమా నిర్మాణమంటేనే ఓ ప్రసహనం మరి. సినిమా రిలీజ్‌ అయ్యాక అక్కడితో ఊపిరి పీల్చేసుకోవడానికి వుండదు. ఆ సినిమాని మళ్ళీ ప్రమోట్‌ చేసుకోవాల్సి వుంటుంది. ‘భరత్‌ అనే నేను’ సినిమా విషయంలో ఈ ‘ప్రమోషన్‌’ కీలక భూమిక పోషిస్తోంది. చిత్ర నిర్మాత, హీరో, దర్శకుడు.. ఇలా ప్రతి ఒక్కరూ సినిమా ప్రమోషన్‌లో తమవంతుగా కీలక భూమిక పోషిస్తున్నారు. 

ఇటీవలి కాలంలో ఈ స్థాయిలో ‘ప్రమోషన్‌’ జరుపుకున్న సినిమా ఇంకోటి లేదనడం అతిశయోక్తి కాదేమో. ‘బాహుబలి’ తర్వాత అంతలా ‘భరత్‌ అనే నేను’ సినిమాకి ప్రమోషన్స్‌ జరుగుతున్నాయ్‌. ఇంకా ఇంటర్వ్యూలు, సక్సెస్‌ మీట్స్‌.. జరుగుతూనే వున్నాయి. అవన్నీ ఒక ఎత్తయితే తాజాగా సినిమాలోని అన్‌కట్‌ వీడియోస్‌ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థ సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేస్తున్న వీడియోస్‌తో ‘భరత్‌ అనే నేను’ వసూళ్ళకి కొత్త ఊపు రానుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

కోట్లు ఖర్చు చేసి సినిమా రూపొందించడమే కాదు, సినిమా హిటయ్యాక, అది మరింత ఎక్కువమందికి చేరువ అవడానికీ, రిపీట్‌ ఆడియన్స్‌ని రప్పించడానికీ ‘భరత్‌ అనే నేను’ నిర్మాత డివివి దానయ్య పడ్తున్న కష్టం అభినందించదగ్గదే. ఈ ప్రమోషన్‌ యజ్ఞంలో దర్శకుడు కొరటాల శివ తీసుకుంటున్న శ్రద్ధ ఇంకా అభినందనీయం. హీరో మహేష్‌ సైతం ఈ యజ్ఞంలో తనవంతు పాత్ర పోషిస్తున్నాడు. 

సోషల్‌ మీడియాలో విడుదలవుతున్న అన్‌కట్‌ వీడియోస్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. సింపుల్‌గా చెప్పాలంటే ఈ వీడియోస్‌ కిర్రాక్‌ పుట్టించేస్తున్నాయ్‌.

You May Like This
- Advertisment -spot_img

Most Popular