HomeMovie News Teluguప్రబాస్‌ డబుల్‌ ధమాకా.!

ప్రబాస్‌ డబుల్‌ ధమాకా.!

‘బాహుబలి’ సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేయాలో తోచని పరిస్థితుల్లో ప్రబాస్‌ గ్యాప్‌ తీసుకున్నాడు. బాహుబలితోనే దాదాపు ఐదేళ్లు వేరే సినిమా ఆలోచన లేకుండా, డార్లింగ్‌ ప్రబాస్‌ ‘బాహుబలి’గా సింగిల్‌ మేకప్‌లో సెటిలైపోయాడు. ఎట్టకేలకు ఆ సినిమా సాధించిన ఘన కీర్తితో యూనివర్సల్‌ స్టార్‌ అని ట్యాగ్‌ సంపాదించాడు కానీ, ఆ స్థాయిలో ప్రబాస్‌ రేంజ్‌ పెరిగిపోయాక, తర్వాతి సినిమా లెవల్స్‌ కూడా అదే రేంజ్‌లో ఉండాలనే అభిమానులు ప్రబాస్‌ నుండి ఎక్స్‌పెక్ట్‌ చేయడంతో, మినిమమ్‌ బడ్జెట్‌ సినిమాగా అనుకన్న ‘సాహో’ కూడా 200 కోట్ల భారీ బడ్జెట్‌ చిత్రంగా రూపాంతరం చెందింది.

ఈ సంగతిటుంచితే, ‘బాహుబలి’తో తీసుకున్న గ్యాప్‌ని కవర్‌ చేసేందుకు ప్రబాస్‌ పక్కాగా ప్రణాళికను రూపొందించేశాడట. ఓ పక్క ‘సాహో’లో నటిస్తూనే, మరో పక్క ‘జిల్‌’ ఫేం రాధాక్రిష్ణతో సినిమా చేసేందుకు ఓకే అన్నాడు. అయితే ఈ సినిమా ఇప్పుడప్పుడే వచ్చేది కాదులే అని లైట్‌ తీసుకునే టైం కాదిది. ఎందుకంటే, ఓ పక్క సాహో సెట్స్‌పై ఉండగానే, రాధాక్రిష్ణ సినిమా కూడా పట్టాలెక్కించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ ఏడాది కూడా ప్రబాస్‌ నుండి సినిమా వచ్చే అవకాశాలు లేవు.

కానీ వచ్చే ఏడాదిలో ఈ రెండు సినిమాలు కొద్ది గ్యాప్‌లో విడుదల చేసేలా ప్రబాస్‌ ప్లాన్‌ చేస్తున్నాడట. సో వచ్చే ఏడాది ప్రబాస్‌ అభిమానులకు పండగే పండగన్న మాట. ఈ కొత్త సినిమాలోనే ప్రబాస్‌తో పూజా హెగ్దే నటిస్తోంది. ‘సాహో’లో బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే.

You May Like This
- Advertisment -spot_img

Most Popular