HomeMovie News Teluguపూజాహెగ్దే రచ్చో రచ్చహ రచ్చోభ్యహ

పూజాహెగ్దే రచ్చో రచ్చహ రచ్చోభ్యహ

లేటెస్టుగా ముద్దుగుమ్మ పూజా హెగ్దే ‘ఫెమినా’ కోసం బికినీలో పోజులిచ్చింది. ఒకటి కాదు, ఏకంగా నాలుగైదు బికినీల్లో తన అందాలను విచ్చల విడిగా ఆరబోసేసింది. అసలే హాట్‌ బ్యూటీ. ఆ సంగతి ‘డీజె’తోనే ప్రూవ్‌ అయిపోయింది. 

ఇప్పుడీ లేటెస్ట్‌ బికినీల్లో చాలా చాలా హాట్‌గా ఉంది పూజా హెగ్దే. ఇప్పుడీ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వైరల్‌ అనేది చిన్న మాటే. రచ్చో రచ్చహ, రచ్చోభ్యహ అనిపిస్తున్నాయి. అయితే సాధారణంగా సెలబ్రిటీలు అవకాశాల కోసం ఈ స్థాయిలో అందాలారబోసి, హాట్‌ టాపిక్‌ అవ్వాలనుకుంటారు. ఆ పై ఫ్రీగా పబ్లిసిటీ కొట్టేస్తారు. కానీ పూజాహెగ్దేకి ఏమంత అవసరం. రావాల్సిన పబ్లిసిటీ ఆమెకి ‘డీజె’ సినిమాతోనే వచ్చేసింది. సినిమా ఫ్లాప్‌ అయినా కానీ పూజా హాట్‌నెస్‌కి మాత్రం భలే క్రేజ్‌ వచ్చేసిందిలే. 

అయినా ఆ సంగతి పక్కన పెడితే, ప్రస్తుతం పూజా హెగ్దేకి చేతి నిండా సినిమాలున్నాయి. అందులోనూ అన్నీ బిగ్‌ ప్రాజెక్ట్సే. మహేష్‌, ప్రబాస్‌ సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే చరణ్‌తో ‘రంగస్థలం’లో జిగేల్‌ రాణీ అంటూ మెరుపులు మెరిపించింది. అలాంటిది మరి పూజాకి ఎందుకు ఇన్ని తంటాలు అంటే, మేగ్జైన్‌ మీద తళుకులీనితే, ఆ ముద్దుగుమ్మలకు వచ్చే క్రేజే వేరు. అందుకోసం భారీ స్థాయిలో రెమ్యునరేషన్‌ అందుకున్నా అందుకుంటారు. అందుకే ఇంత క్రేజీగా ముద్దుగుమ్మలు మేగ్జైన్స్‌పై అందాలారబోసి, మురిసిపోతుంటారు. 

ఏ మాటకామాటే చెప్పుకోవాలి. పూజా హెగ్దే కారణంగా బికినీలకే కొత్త గ్లామర్‌ వచ్చిందంటే అతిశయోక్తి కాదండోయ్‌.

You May Like This
- Advertisment -spot_img

Most Popular