HomeMovie News Teluguఆ విషయంలో నేను చాలా వీక్‌ అంటోన్న అనుష్క

ఆ విషయంలో నేను చాలా వీక్‌ అంటోన్న అనుష్క

ఆ విషయం అంటే ఇంకేదో అనుకోకండి. సహజంగా అమ్మాయిలకు ఫ్యాషన్‌పై ఇంట్రెస్ట్‌ ఎక్కువ. ట్రెండ్‌కు తగ్గట్లుగా మేకప్‌ చేసుకోవాలనీ అనుకుంటూ ఉంటారు. ఇక హీరోయిన్స్‌ అయితే న్యూ ట్రెండ్స్‌ని క్రియేట్‌ చేయడంలో ఎప్పటికప్పుడే కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారు. సినిమాల్లో ఎలాగూ పాత్ర సన్నివేశానికి తగ్గట్లుగా డైరెక్టర్స్‌ డిజైన్‌ చేసే దుస్తులను, యాక్సెసరీస్‌ను వాడాల్సి ఉంటుంది. అయితే బహిరంగ ప్రదేశాల్లో కూడా ముద్దుగుమ్మలు ట్రెండీగా రెడీ అయి వస్తుండడం చూస్తూనే ఉంటాం. 

కానీ ఈ విషయంలో ముద్దుగుమ్మ అనుష్క మాత్రం సెపరేట్‌ అని చెప్పాలి. అసలు డ్రెస్సింగ్‌లో తెరపై కనిపించే అనుష్కకీ, బహిరంగ వేడుకల్లో కనిపించే అనుష్కకీ.. ఆకాశానికీ, పాతాళానికీ ఉన్నంత తేడా ఉంటుంది. అదే విషయం ఆమెని అడిగితే, ఫ్యాషన్‌లో నేను చాలా వీక్‌ అంటోంది. ఎందుకు అంటే మేకప్‌తో ఎప్పుడూ సినిమాల్లో బిజీగా ఉండే తనకు బయట విత్‌ అవుట్‌ మేకప్‌, నిండైన దుస్తుల్లో ఉండడమంటేనే ఇష్టమని సింపుల్‌గా చెబుతుంది. అందుకే అనుష్క ఆటిట్యూడ్‌ని అంతా ఇష్టపడుతూ ఉంటారు. 

డైరెక్టర్స్‌నీ, ప్రొడ్యూసర్స్‌నీ అస్సలు ఇబ్బంది పెట్టదట. అందరితోనూ కలిసి మెలిసి మెలుగుతుందట. స్టార్‌డమ్‌తో అస్సలు సంబంధం లేకుండానే ప్రతీ టెక్నీషియన్‌తోనూ కలివిడిగా ఉంటుందనీ ఆమె సన్నిహితులు అంటూంటారు. అందుకే అందరికీ స్వీటీ అంటే అంత ఇష్టం. తాజాగా ‘భాగమతి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, సూపర్‌ హిట్‌ కొట్టింది. వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు, ఓవర్సీస్‌లో కూడా అనుష్క ‘భాగమతి’తో కాసుల పంట పండిస్తోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular