HomeMovie News Teluguవర్మగారి పూర్ణ ప్రకంపనలు

వర్మగారి పూర్ణ ప్రకంపనలు

రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘జీఎస్‌టీ (గాడ్‌, సెక్స్‌, అండ్‌ ట్రూత్‌)’ ఈ నెల 26న విడుదల కానుందంటూ సంచలన ప్రకటన చేశారు వర్మ. వర్మ అంటేనే సంచలనం. ఆయన ఏం చేసినా సంచలనాలే. అలాంటిది ఈ సంచలన డైరెక్టర్‌ ఓ పోర్న్‌ స్టార్‌తో సినిమా తెరకెక్కించడం అంటే అందరి దృష్టీ అటు వైపే. అదేదో మామూలు సినిమా అనుకుంటే ఓకే. కానీ అలా కాదు కదా. పోర్న్‌ స్టార్‌తో సినిమా తెరకెక్కించి కొత్త సెన్సేషన్‌కి తెర లేపాడు రామ్‌గోపాల్‌ వర్మ. 

అందులోనూ ఈ సినిమాకి సంబంధించి న్యూడ్‌ ఫోటోలు ఒక్కొక్కటిగా వస్తూనే ఉన్నాయి సోషల్‌ మీడియాలో. ఇంతవరకూ పోర్న్‌ స్టార్‌ అంటే సన్నీలియోన్‌ గురించే మనకు తెలుసు. అలాంటిది వర్మ పుణ్యమా అని ఇప్పుడు మరో పోర్న్‌ స్టార్‌ మియా మల్కోవా ఇండియన్‌ స్క్రీన్‌కి పరిచయం కాబోతోంది. సన్నీలియోన్‌ పోర్న్‌ రంగం నుండి వచ్చినా, ఇంతవరకూ సినిమాల్లో ఎప్పుడూ న్యూడ్‌గా కనిపించిన దాఖలాలు లేవు. కానీ మియా మల్కోవా వస్తూ వస్తూనే న్యూడ్‌ ప్రభంజనం సృష్టించేస్తోంది. 

సోషల్‌ మీడియాలో అమ్మడు చేస్తున్న న్యూడ్‌ హంగామా అలా ఇలా లేదు. ఇటీవల విడుదలైన టీజర్‌తోనే చూపించాల్సిందంతా చూపించేశాడు వర్మ. ఇంక సినిమాలో ఇంకెంత చూపించనున్నాడో అంటూ అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరో పక్క ప్రస్తుతం వార్తల్లో హాట్‌ టాపిక్‌గా ఉన్న సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ రామ్‌ గోపాల్‌ వర్మ ‘జీఎస్‌టీ’కి బాసటగా నిలవడం కొసమెరుపు. 

మియా మల్కోవాని ప్రశంసలతో ముంచేస్తూ కత్తి మహేష్‌ సోషల్‌ మీడియాలో స్పందిస్తున్న తీరు ఒకింత ఆశ్చర్యాన్నీ, నెటిజన్స్‌ని ఇరిటేషన్‌కీ గురి చేస్తున్నాయి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular