HomeMovie News Teluguసెలబ్రేషన్‌ ఆఫ్‌ 'రంగస్థలం'

సెలబ్రేషన్‌ ఆఫ్‌ ‘రంగస్థలం’

‘రంగస్థలం’ సినిమా టైటిల్‌ దగ్గర్నుంచీ సినిమాపై ఎక్కడో చిన్న చిన్న అనుమానాలు అలా వస్తూనే ఉన్నాయి. ముప్ఫయ్యేళ్ళ నాటి పరిస్థితుల నేపథ్యంలో, ఆనాటి కాలానికి దగ్గ కథ, నేటివిటీ కలగలిపి ‘రంగస్థలం’ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై ‘రంగస్థలం’ సినిమాని దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసినదే. 

సినిమా ఫస్ట్‌ లుక్‌ కన్నా ముందే ఈ సినిమాలోని చాలా స్టిల్స్‌ బయటకు వచ్చాయి. కొన్ని స్టిల్స్‌ ఆన్‌ లొకేషన్‌ నుంచి టీమ్‌ మెంబర్స్‌ రిలీజ్‌ చేస్తే (వీటిల్లో సెట్స్‌ గురించి మాత్రమే కన్పించింది), ఇంకొన్ని స్టిల్స్‌ అక్రమంగా లీక్‌ అయ్యాయి. లీక్‌ వ్యవహారంపై సినిమా నిర్మాణ సంస్థ పోలీసులను కూడా ఆశ్రయించింది. అదలా ఉంటే ప్రతి స్టిల్‌ సినిమాపై అంచనాల్ని పెంచేస్తూనే వచ్చింది. ఏ స్టిల్‌కి ఆ స్టిల్‌ ‘సెలబ్రేషన్‌’ అనే స్థాయిలోనే ఉందని నిస్సందేహంగా చెప్పవచ్చు. సినిమా ఫస్ట్‌ లుక్‌ అయితే ‘సెలబ్రేషన్‌ కా బాప్‌’ అనిపించేలా ఉంది. లేటెస్ట్‌గా ఇంకో స్టిల్‌ వచ్చింది. సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ సినిమా యూనిట్‌ ఈ స్టిల్‌ని రిలీజ్‌ చేసింది. సంక్రాంతి సంబరాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అనేలా ఉంది ఈ స్టిల్‌. 

సమంత తొలిసారిగా చరణ్‌ సరసన నటిస్తోన్న సినిమా ఇది. బుల్లితెర బ్యూటీ అనసూయ ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్రలో కన్పిస్తోంది. ఏ పాత్రకి ఆ పాత్రే అనేంతలా ప్రతి పాత్రనీ అత్యద్భుతంగా దర్శకుడు తీర్చి దిద్దాడట. త్వరలో సినిమా టీజర్‌ రిలీజ్‌ కాబోతోంది. అంటే ఇంకో సంబరానికి రెడీ అయిపోవాలన్నమాట. మార్చిలో సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయి. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆద్యంతం హృదయాన్ని హత్తుకునే సన్నివేశాలతోపాటు, ఆకాశాన్నంటే సంబరాల తరహాలో ఉండబోతోందని సమాచారమ్‌. గోదావరి అందాలు ఈ సినిమాలో నభూతో నభవిష్యతి అనేలా చిత్రీకరించారట.

You May Like This
- Advertisment -spot_img

Most Popular