HomeMovie News Teluguహాట్‌నెస్‌ ప్లస్‌ హుందాతనం ఈక్వల్‌ టు శ్రియ

హాట్‌నెస్‌ ప్లస్‌ హుందాతనం ఈక్వల్‌ టు శ్రియ

తొలి సినిమా ‘ఇష్టం’ సినిమా నుండి తాజా చిత్రం ‘గాయత్రి’ వరకూ కెరీర్‌లో చాలా ఎత్తు పల్లాలు చూసింది శ్రియ. ఇప్పుడున్న హీరోయిన్స్‌ అందిలోనూ శ్రియ సీనియర్‌ అని చెప్పొచ్చు. స్టార్‌ హీరోల సరసన నటించింది. యంగ్‌ హీరోలతోనూ చేసింది. చిన్న చిన్న సినిమాల్లోనూ కనిపించింది. ఏం చేసినా తనని తాను కన్విన్స్‌ చేసుకోగలగడం ఆమె ప్రత్యేకత. అందుకే ఇంత సుదీర్ఘ కాలం సినీ పోటీ ప్రపంచంలో హీరోయిన్‌గా తట్టుకుని నిలబడింది. 

‘గౌతమీ పుత్ర శాతకర్ణి’, గోపాల గోపాల’, ‘మనం’ తదితర సినిమాలతో తిరిగి స్టార్‌ డమ్‌ సంపాదించింది. గ్లామర్‌ పరంగా అప్పుడెలా ఉందో ఇప్పుడూ అలాగే ఉందామె. నటన పరంగా ఎప్పుడూ శ్రియ ది బెస్ట్‌ అంతే. తన కెరీర్‌లో మరో అద్భుతమైన సినిమా ‘గాయత్రి’ రూపంలో రాబోతోందని శ్రియ నమ్మకంగా చెబుతోంది. మోహన్‌బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సినిమా ఇది. విష్ణు, శ్రియ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. ‘నేనేదనుకుంటే అది చెప్పడం నాకలవాటు. తర్వాతి సంగతి తర్వాత..’ అంటూ శ్రియ తాజా లుక్‌ని ‘గాయత్రి’ టీమ్‌ విడుదల చేసింది. ఆమె పాత్ర ఆటిట్యూడ్‌ ఎలాంటిదో ఈ లుక్‌తో చెప్పేశారు. 

శ్రియ చాలా హోమ్లీగా కనిపిస్తోంది. ఇదివరకు విష్ణు, శ్రియ కాంబినేషన్‌లో లుక్స్‌ రివీల్‌ చేశారు. లుక్స్‌ విషయం పక్కన పెడితే, సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి. ఆడియన్స్‌లోనూ సినిమాపై చాలా క్యూరియాసిటీ నెలకొంది. ఇంతకీ ఇన్నేళ్ల పాటు శ్రియ తన గ్లామర్‌ని ఎలా కాపాడుకుంటుందో తెలుసా.. ఎప్పుడూ హ్యాపీగా ఉండడమేనట అందుకు కారణం. ఫిట్‌గా ఉండడం ఆనందంగా ఉండడం పోజిటివ్‌ ఆటిట్యూడ్‌తో ముందుకెళ్లడం తన సక్సెస్‌ సీక్రెట్‌ అని శ్రియ చెబుతుంది. ఏదేమైనా హాట్‌నెస్‌కి హాట్‌నెస్‌ హుందాతనానికి హుందాతనం అన్నీ కలగలిస్తేనే శ్రియ. అదే ఆమె స్పెషల్‌.

You May Like This
- Advertisment -spot_img

Most Popular