HomeMovie News Teluguరకుల్‌ ప్రీత్‌సింగ్‌తో ఓ రోజంతా!

రకుల్‌ ప్రీత్‌సింగ్‌తో ఓ రోజంతా!

ప్రస్తుతం ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బాలీవుడ్‌లో ‘అయ్యారీ’ సినిమాతో బిజీగా ఉంది. ఆ సినిమా ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అయ్యింది. జనవరి 26న ‘అయ్యారీ’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు వేగవంతం చేశారు. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ తన అభిమానులకు ఓ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. 

‘మీ జీవితంలో బెస్ట్‌ లవ్‌ మూమెంట్‌ చెబితే.. వారికి ఒక రోజంతా రకుల్‌ ప్రీత్‌సింగ్‌తో గడిపే అద్భుతమైన ఆఫర్‌ అది. ఆగండాగండి.. తొందరపడకండి. ఆఫర్‌ అంటే అందరిదీ కాదు కదా. తమ వద్దకు వచ్చిన లవ్‌ మూమెంట్స్‌లో ‘ది బెస్ట్ లవ్‌ మూమెంట్‌ని సెలక్ట్‌ చేసి వారికి రకుల్‌ ప్రీత్‌సింగ్‌తో ఒక రోజంగా స్పెండ్‌ చేసే అవకాశాన్ని చిత్ర యూనిట్‌ కల్పించనుందట. భలే ఉంది కదా ఈ ఆఫర్‌. ‘లే డూబా..’ అనే హ్యాష్‌ ట్యాగ్‌తో ఈ క్రేజీ ఆఫర్‌ని రకుల్‌ ప్రీత్‌సింగ్‌ సోషల్‌ మీడియాలో తన అభిమానులకు షేర్‌ చేసింది. 

ఇంకేముంది..ప్రేమ జంటలు తమ తమ లవ్‌ లైఫ్‌లో జరిగిన బెస్ట్‌ లవ్‌ మూమెంట్స్‌ ఏంటా..అని సెర్చ్‌ చేసేస్తున్నారు. అదీ సంగతి. నీరజ్‌ పాండే దర్శకత్వంలో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నటిస్తున్న బాలీవుడ్‌ చిత్రం ‘అయ్యారీ’. సిద్దార్ద్‌ మల్హోత్రా ఈ సినిమాలో రకుల్‌తో జత కడుతున్నాడు. ఈ సినిమా నుండి లేటెస్టుగా వచ్చిన ‘లే డూబా..’ సాంగ్‌ యూత్‌ని మెస్మరైజ్‌ చేసేస్తోంది. ఈ స్వీట్‌ అండ్‌ లవ్‌లీ రొమాంటిక్‌ మెలోడీ సాంగ్‌కి యూత్‌ బాగా కనెక్ట్‌ అవుతున్నారు. 

తెలుగులో స్టార్‌ హీరోలందరి సరసనా నటించి స్టార్‌ హీరోయిన్‌ అనిపించుకున్న రకుల్‌ ప్రీత్‌సింగ్‌ బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది ఈ సినిమాతో. బాలీవుడ్‌లోనూ రకుల్‌కి ‘అయ్యారీ’తో మంచి సక్సెస్‌ రావాలనీ ఆశిద్దాం!

You May Like This
- Advertisment -spot_img

Most Popular