HomeMovie News Teluguఅల్లు అర్జున్‌ ఫస్ట్‌ ఇంపాక్ట్‌ ఎలా ఉండబోతోంది?

అల్లు అర్జున్‌ ఫస్ట్‌ ఇంపాక్ట్‌ ఎలా ఉండబోతోంది?

టీజర్‌ అన్న మాట రొటీన్‌ అయిపోయింది. అందుకే బాలకృష్ణ సినిమా ‘పైసా వసూల్‌’ కోసం దర్శకుడు పూరీ జగన్నాధ్‌ ‘స్టంపర్‌’ అనే పదాన్ని కనిపెట్టాడు. టీజర్‌ కంటే ఎక్కువ, ట్రైలర్‌ కంటే తక్కువ నిడివి ఈ స్టంపర్‌ ప్రత్యేకత. పేరేదైనా సినిమాకి సంబంధించి ప్రమోషన్‌ వీడియో అది. ఇప్పుడు అల్లు అర్జున్‌ ‘ఫస్ట్‌ ఇంపాక్ట్‌’ అంటున్నాడు. 

రెండు రోజుల్లో ఈ ‘ఫస్ట్‌ ఇంపాక్ట్‌’ మన ముందుకు రాబోతోంది. ఇది టైటిల్‌తో కూడిన హీరో ఫస్ట్‌లుక్‌ అనుకోవాలా? లేక ఫస్ట్‌లుక్‌ ఫోటో అనుకోవాలా..? ఇవేమీ కాక టీజర్‌, స్టంపర్‌ తరహాలో ఉండే వీడియో అనుకోవాలా అనే చిన్న కన్‌ఫ్యూజన్‌ మొదట్లో వినిపించింది. తాజా సమాచారమ్‌ ప్రకారం ఇదొక వీడియో బైట్‌ అని తెలుస్తోంది. టీజర్‌, స్టంపర్‌ తరహాలోనే ఉంటుంది. నిడివి ఎంతనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్‌. ఈ ఫస్ట్‌ ఇంపాక్ట్‌ని చాలా పవర్‌ ఫుల్‌గా రూపొందించారనీ సమాచారమ్‌. వీడియోలో అల్లు అర్జున్‌ మాత్రమే కనిపిస్తాడట. యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఉంటాయి. ఓ పవర్‌ ఫుల్‌ డైలాగ్‌ కూడా ఉంటుంది. ఆ డైలాగ్‌ హీరో క్యారెక్టరైజేషన్‌ని ఎలివేట్‌ చేసేలా ఇందులో పొందుపర్చారనీ సమాచారమ్‌. 

చూడాలి అల్లు అర్జున్‌ సినిమాతో స్టార్ట్‌ అయిన ఈ ‘ఫస్ట్‌ ఇంపాక్ట్‌’ ఎలా ఉంటుందో మరి. వక్కంతం వంశీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రముఖ రచయితగా పాపులర్‌ అయిన వక్కంతం వంశీ ఈ సినిమాతో మెగాఫోన్‌ పట్టాడు. ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఏప్రిల్‌కి అనగా సమ్మర్‌ సీజన్‌లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular