HomeMovie News Teluguటాలీవుడ్‌కి మరో బ్యూటీ దొరికేసినట్లే!

టాలీవుడ్‌కి మరో బ్యూటీ దొరికేసినట్లే!

అఖిల్‌ – కళ్యాణీ ప్రియదర్శన్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘హలో’. ఈ సినిమాతో కళ్యాణీ టాలీవుడ్‌కి పరిచయమైంది. ఈరోజే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులేయించుకుంటోందీ ముద్దుగుమ్మ కళ్యాణీ. 

తొలి సినిమాకే నటిగా మంచి టాక్‌ సంపాదించుకుంటోందంటే హీరోయిన్‌గా ఈ ముద్దుగుమ్మ పాసైపోయినట్లే. ఒకప్పటి హీరోయిన్‌ లిజీ కూతురే ఈ కళ్యాణీ ప్రియదర్శిని. లిజీ అప్పట్లో పలు తెలుగు చిత్రాల్లో నటించింది. ఎంతో కాన్ఫిడెంట్‌గా కూతుర్ని సినీ రంగం వైపు తీసుకొచ్చింది. అదే కాన్ఫిడెన్స్‌ని తొలి సినిమాకే ప్రదర్శించిందీ బ్యూటీ. టాలీవుడ్‌కి హీరోయిన్స్‌ కొరత వెంటాడుతోందిప్పుడు. ఈ తరుణంలో కొత్త హీరోయిన్స్‌ వైపు మన దర్శక నిర్మాతలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. 

ఇప్పటికే పలువురు ముద్దుగుమ్మలు హీరోయిన్స్‌గా తొలి పరిచయంలోనే టాలెంట్‌ చూపిస్తున్నారు. ఆడియన్స్‌ దృష్టినీ బాగా ఆకట్టుకుంటున్నారు. నటనలో కొత్త భామలు ఒకరిని మించిన టాలెంట్‌ మరొకరు చూపిస్తున్నారు. ఎవ్వరి నటనకీ దాదాపుగా వంకలు పెట్టేలా లేదు. దాంతో వరుస అవకాశాలు కూడా దక్కించుకుంటున్నారు. అంతేకాదు యాక్టింగ్‌ టాలెంట్‌ ముందు గ్లామర్‌ కూడా చిన్నబోతోంది. 

ఇదివరకట్లో హీరోయిన్‌ అంటే గ్లామర్‌ కోసం ఆలోచించేవారు. కానీ ఇప్పుడు యాక్టింగ్‌ టాలెంట్‌ గ్లామర్‌ని డామినేట్‌ చేసేస్తోంది. గ్లామర్‌ అనేది పెద్దగా ప్రయారిటీ లేని అంశమైపోయింది. హీరోయిన్‌ క్యారెక్టర్స్‌ని కూడా బలంగా తీర్చిదిద్దుతున్నారు ఇప్పటి రచయితలు, డైరెక్టర్లు. సో ఆ రకంగా మంచి మంచి ఛాన్సెస్‌ దక్కించుకుంటున్నారు ముద్దుగుమ్మలు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular