HomeMovie News Telugu'అజ్ఞాతవాసి' నోట పవన్‌ పాట 'కొడకా.. కోటేశ్వరరావ్‌'

‘అజ్ఞాతవాసి’ నోట పవన్‌ పాట ‘కొడకా.. కోటేశ్వరరావ్‌’

‘కాటమరాయుడా.. కదిరి నరసింహుడా..’ పాట తెలియని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆది పవన్‌ నోట పలికిన పాట కాబట్టి. ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్‌ స్వయంగా పాడిన ఆ పాట ఎంత ఊపు ఊపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిదే ఇప్పుడు ‘అజ్ఞాతవాసి’ సినిమాలో కూడా ఉందట. ఆ పాటని పవన్‌ స్వయంగా ఆలపించారట. భాస్కరభట్ల ఈ పాటని రచించారు. చాలా సరదా సరదాగా ఈ పాట రికార్డింగ్‌ జరిగింది.  

సోషల్‌ మీడియాలో దీనికి సంబంధించిన ఫోటోలు సందడి చేస్తున్నాయి. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ పాటకి అనిరుధ్‌ ట్యూన్స్‌ ఇచ్చాడు. ‘కాటమరాయుడా..’ పాట మాదిరిగానే చాలా జోష్‌గా ఉంటుందట ఈ పాట కూడా. గత కొంత కాలం నుండీ పవన్‌ ఈ సినిమాలో పాట పాడాడంటూ న్యూస్‌ వస్తున్నా, ఆ విషయమై ఇంతవరకూ అఫీషియల్‌ క్లారిటీ రాలేదు. తాజాగా ఈ పాటపై క్లారిటీ వచ్చేసింది. న్యూ ఇయర్‌ గిఫ్ట్‌గా ఈ పాటని డిశంబర్‌ 31న విడుదల చేయనున్నారు. న్యూ ఇయర్‌లో పవన్‌ నుండి అభిమానులకు వచ్చే తొలి సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్‌ ఇదే అవుతుంది. ఇంతవరకూ అనిరుధ్‌ మ్యూజిక్‌లో వచ్చిన సాంగ్స్‌ అన్నీ అభిమానుల్ని అలరిస్తున్నాయి. 

టాలీవుడ్‌కి కొత్త మ్యూజిక్‌ దర్శకుడైన అనిరుధ్‌, ‘అజ్ఞాతవాసి’తో సరికొత్త మ్యూజిక్‌ని పరిచయం చేశాడు. జనంలోకి బాగా వెళ్లిపోతున్నాయి. మామూలుగానే పవన్‌ సినిమా ఆడియో అంటే అభిమానులకు ఎప్పుడే కిక్కే. వాటిన్నింట్లోకీ ఈ తాజా ఆడియో మరింత కిక్‌ ఇచ్చేలా ఉంది. ఇక త్వరలోనే రాబోతున్న ‘కొడకా.. కోటేశ్వర్రావ్‌’ పాట ఇంకెన్ని సంచనలనాలకు వేదికవుతుందో చూడాలి మరి. జనవరి 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అనూ ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular