HomeMovie News Telugu'భాగమతి' - తమన్‌ అదరగొట్టేశాడంతే!

‘భాగమతి’ – తమన్‌ అదరగొట్టేశాడంతే!

అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భాగమతి’. ‘పిల్లజమీందార్‌ ఫేం’ అశోక్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా టీజర్‌ విడుదలైంది. 

ఓ కోట, ఆ కోటలోకి ఓ వ్యక్తి అడుగుపెడుతుంటే, అక్కడి వస్తువులు కదులుతున్నట్లుగా కనిపిస్తోంది. ఆ కోటలో అనుష్క సుత్తితో తన చేతిని తానే గోడకి కొట్టేసుకుంటోంది. అదీ టీజర్‌. చాలా కొత్తగా ఉంది. ఫస్ట్‌లుక్‌లోనూ అనుష్క ఇదే రకంగా భయంకరమైన లుక్‌లో కనిపించింది. ఓ చేతిలో సుత్తి, ఇంకో చేతిని మేకుతో గోడకు శిలువ వేసినట్లుగా కనిపించింది. అదే టీజర్‌లో చూపించారు. అంటే అనుష్కే తన చేతిని తాను సుత్తితో కొట్టుకుంటోందన్న మాట. ఏదేమైనా టీజర్‌ చాలా ఆశక్తికరంగా ఉంది. కొత్త రకం కథతో తెరకెక్కుతోన్న చిత్రమిది. 

తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. టీజర్‌లో బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కొత్తగా ఉంది. ఇంతవరకూ తమన్‌ ఇలాంటి ట్యూన్‌ ఏ సినిమాకీ కొట్టుండడనిపిస్తోంది. కొద్ది సెకన్ల పాటున్న టీజర్‌లోనే ఇంత గొప్పగా బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ అందించిన తమన్‌, సినిమాకి మరింత ఆకట్టుకునే మ్యూజిక్‌ అందించాడట. సక్సెస్‌ఫుల్‌ బ్యానర్‌ యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ తర్వాత అనుష్క నటిస్తున్న చిత్రమిది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌ మూవీ ఇది. థ్రిల్లింగ్‌ అంశాలు ఇంతవరకూ ఎక్కడా చూడనంత కొత్తగా ఉంటాయట. 

ఆది పినిశెట్టి, జయరాం, ఆశా భరత్‌, ఉన్ని ముకుందన్‌ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్‌. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular