HomeMovie News Teluguవన్‌ అండ్‌ ఓన్లీ చిరంజీవి

వన్‌ అండ్‌ ఓన్లీ చిరంజీవి

2017 వ సంవత్సరం చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంవత్సరం. అలా అభిమానులకు ఆనంద సంవత్సరం. తొమ్మిదేళ్ల గ్యాప్‌ తర్వాత వచ్చినా చిరంజీవిలో ఏమాత్రం గ్రేస్‌ తగ్గలేదు. బాక్సాఫీస్‌కి బాస్‌ సత్తా ఏంటో చూపించాడు. ఈ ఏడాది చిరంజీవి 150వ సినిమాతోనే బోణీ కొట్టింది. బోణీ అంటే అలాంటి ఇలాంటి బోణీ కాదు. బాక్సాఫీస్‌ రారాజు రీ ఎంట్రీలోనూ వంద కోట్లు వసూళ్లు కొల్లగొట్టాడు. డాన్సులు, స్టైల్‌ తన హ్యూమర్‌తో అభిమానుల్లో కొత్త ఉత్సాహం తెచ్చాడు. బాక్సాఫీస్‌కి కాసుల పంటతో కళకళలాడించాడు. 

మెగాస్టార్‌ బోణీతో ఈ ఏడాది తర్వాత వచ్చిన బాలయ్య ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’, నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయనా’, శర్వానంద్‌ ‘శతమానం భవతి’ సినిమాలు బాక్సాఫీస్‌కి మంచి వసూళ్లు రాబట్టాయి. అలా 2017కు మెగాస్టార్‌ వన్‌ అండ్‌ ఓన్లీ రీ ఎంట్రీ సూపర్బ్‌ అనిపించింది. ఇప్పుడు చిరంజీవి తన 151వ చిత్రంతో బిజీగా ఉన్నాడు. తొలి స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో నటిస్తున్నాడు చిరంజీవి. ఇటీవలే సెట్స్‌ పైకి వెళ్లింది ఈ సినిమా. ఈ సినిమాతో మరోసారి చరిత్ర సృష్టించనున్నాడు మెగాస్టార్‌. 

ఈ సినిమాలో బాలీవుడ్‌ నుండి బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. గతంలో చిరంజీవితో నటించిన ఓ ప్రముఖ హీరోయిన్‌ కూడా ఈ సినిమాలో నటిస్తోందనీ సమాచారమ్‌. అలాగే మెగా ఫ్యామిలీ హీరోల్లో పవన్‌ కళ్యాణ్‌, సాయి ధరమ్‌తేజ్‌ ఇలా కొందరు ఈ సినిమాలో గెస్ట్‌ రోల్స్‌ పోషించనున్నారనీ తెలుస్తోంది. సురేందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పరుచూరి బ్రదర్స్‌ కథనందించారు. 

చిరంజీవి 150వ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ నిర్మాణంలోనే ఈ చిత్రం కూడా తెరకెక్కుతోంది. యూనివర్సల్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారట. 2019లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular