HomeMovie News Teluguబోయ్‌ ఫ్రెండే కాదు..అంతకు మించి

బోయ్‌ ఫ్రెండే కాదు..అంతకు మించి

ఇటీవల ముద్దుగుమ్మ శృతిహాసన్‌ వార్తల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే విచిత్రమేంటంటే సినిమాల గురించి కాదు. ఆమె ఎక్కడ చూసినా తన బోయ్‌ ఫ్రెండ్‌తో కలిసి దర్శనమిస్తోంది. కెమెరా కళ్లకు చిక్కుతోంది. ఆ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

మొన్నీమధ్యనే తన తల్లి సారికకు బోయ్‌ ఫ్రెండ్‌ మైఖేల్‌ని పరిచయం చేసింది. ఆ ఫోటోలు చూసి శృతిహాసన్‌ పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు హల్‌ చల్‌ చేశాయి. అయితే ఇందుకు కంటిన్యూస్‌గా తండ్రి కమల్‌ హాసన్‌తో శృతి ఉన్న ఫోటోలు తాజాగా వైరల్‌ అయ్యాయి. ఓ పెళ్లి వేడుకలో ఈ తల్లీ కూతుళ్లిద్దరూ సందడి చేశారు. ఇక్కడే చిన్న ట్విస్ట్‌. తండ్రీ కూతుళ్లే కాదు, శృతి తన బోయ్‌ ఫ్రెండ్‌తో కూడా కలిసుంది ఈ ఫోటోల్లో. అంటే తండ్రి కమల్‌ హాసన్‌కి శృతి తన బోయ్‌ ఫ్రెండ్‌ని పరిచయం చేసేసిందన్న మాట. 

తమిళ నటుడు ఆదవ, వినోదినిల వివాహం మంగళవారం చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి శృతి తన బోయ్‌ ఫ్రెండ్‌తో కలిసి హాజరైంది. కమల్‌ హాసన్‌ కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. ఈ వివాహ వేడుకలోనే శృతి తన బోయ్‌ ఫ్రెండ్‌ని తండ్రికి పరిచయం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫోటోల సంగతి ఇలా ఉంచితే, శృతికి ఆల్రెడీ మైఖేల్‌తో పెళ్లయిపోయిందనీ, కాదు కాదు మైఖేల్‌తో సహజీవనం చేస్తోందంటూ పలు రకాల గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. వీటిలో నిజమెంతుందో తెలీదు కానీ, శృతి – మైఖేల్‌ చెట్టాపట్టాలు చూస్తుంటే ఏమో నిజమేననిపిస్తోంది. ఏదేమైనా ఈ వివాహ వేడుకకు నిండైన ట్రెడిషనల్‌ వేర్‌లో శృతి జంట భలే కనువిందు చేస్తోంది. అలాగే అభిమానుల్ని ఆశ్చర్యపరుస్తోంది కూడా.

You May Like This
- Advertisment -spot_img

Most Popular